తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు మరోసారి భేటీ అయినా సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈరోజు సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు.                     

 

ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చలు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకున్నారు.      

 

ఈ నేపథ్యంలోనే కృష్ణ వాటర్ పై కూడా చర్చించుకున్నారు .. అప్పుడే వారికీ సొల్యూషన్ దొరికేసింది... ఆ సొల్యూషన్ ఏంటంటే.. కృష్ణా నదిలో నీటి లభ్యతలో ఏటికేడు అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు.                        

 

ఆ ఏకాభిప్రాయం ఏంటంటే.. కృష్ణా నదిలో నీరు లేకపోవడం వల్ల కృష్ణా నది ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందడం లేదు. అందువల్ల పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నుంచి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు కూడా నీరు అందించాలి అని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా కృష్ణ వాటర్ సమస్యకు సొల్యూషన్ దొరికింది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: