ఈరోజుల్లో సైబర్ నేరగాళ్ల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నది అన్న  విషయం తెలిసిందే. అయితే సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకునేందుకు బ్యాంకులు తమ కస్టమర్లకు అవగాహన కల్పించడంతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక బ్యాంక్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తికి అకౌంట్ నుంచి 43 లక్షలు మాయం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఐసిఐసిఐ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం పిక్స్ డిపాజిట్ ఖాతాదారుని ఖాతాలోనే 43.07 లక్షలు మాయం చేసింది. బాధితుడు ఓ ప్రవాస భారతీయుడు ఉత్తమ్ కుమార్. 2015 సంవత్సరంలో సికింద్రాబాద్లోని ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాలో 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఈ వ్యక్తి. ఆ తర్వాత యుఎస్ వెళ్ళిపోయారు. ఆపై అదే ఏడాది డిసెంబర్లో తన అకౌంట్ తనిఖీ చేసుకోగా తన అకౌంట్ పాస్వర్డ్ మారినట్లు సమాచారం అందింది. వెంటనే కంగారు పడిపోయిన ఆ వ్యక్తి బ్యాంకును  సంప్రదించగా మీరే పాస్వర్డ్ మార్చుకోవాలన్నా సూచన వచ్చింది అంటూ బ్యాంకు సిబ్బంది తెలిపారు.

 

 

 ఒక పాస్వర్డ్ మార్చిన తర్వాత ఆ వ్యక్తి తన ఖాతా ఓపెన్ చేసి చూసుకోగానే  43.07,  535 రూపాయలు  విత్డ్ డ్రా  అయినట్లు తెలిసింది. అయితే దీంతో అవాక్కయిన ఆ వ్యక్తి బ్యాంకు అధికారులను సంప్రదించిన్నప్పటికీ వారి నుండి సరైన స్పందన లేకపోవడంతో ఉత్తమ్  కుమార్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి భాస్కర్ రాజు అనే వ్యక్తి అరెస్టు చేసి రెండు లక్షలు మాత్రమే అతని నుంచి చేయగలిగారు. ఉత్తమ్ కుమార్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బును కాచేసిన నిందితుల్లో కొందరు విదేశాలకు పారిపోవడం తో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. 43 లక్షలు కాచేసిన నిందితులు నుండి కేవలం రెండు లక్షలు మాత్రమే రికవరీ చేశారు.. 

 

 

 అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతోనే తాను మోసపోయానని సచివాలయంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు... ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బు పోవడానికి బ్యాంకు దే  బాధ్యత అని తేల్చారు ... గల్లంతైన 9 శాతం వడ్డీ ఖర్చుల కింద 50 వేలు మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు 500000 కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సదరు ఐసిఐసిఐ బ్యాంకు మాత్రం డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకు ఆస్తులను జప్తు చేసి తనకు న్యాయం చేయాలని ఉత్తమ్ కుమార్ మరోసారి అధికారుల విభాగాన్ని ఆశ్రయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: