తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది అనే విషయం తెలిసిందే. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి పండుగ... అంబరాన్నంటేల  సంబరాలు జరుగుతూనే ఉంటాయి. భోగిరోజు భోగభాగ్యాలు ప్రసాదించాలని భోగి మంటలు వేసి వాటిచుట్టూ ఆడిపాడతూ  సంబరాలు చేసుకుంటారు. భోగి మంటలు వేస్తే పీడలు తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. ఇక సంక్రాంతి వచ్చిందంటే రంగురంగుల రంగవల్లులు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు సాంప్రదాయ వస్త్రధారణలో... ఇలా ఎక్కడ చూసినా కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. 

 

 

 ఇక తెలుగు ప్రజలందరికీ ఎక్కువగా ఇష్టమైన రోజు కనుమ. కనుమరుగైతే ఎక్కువగా హడావిడి ఉంటుంది. కోడి పందాలు ఎడ్ల పందాలు ఇలా హోరెత్తిపోతుంటుంది. తెలంగాణ రాష్ట్రం కంటే కనుమ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హడావిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా గుర్తొచ్చేది కోడి పందాలు. కోడిపందాలు లేవు అంటే అసలు అది ఒక సంక్రాంతి పండుగ అని అనుకోరు అక్కడి ప్రజలు. కోడిపందాలతో పాటు ఎడ్లబండ్ల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ పోటీలలో  ప్రజలు అందరికీ ఎన్నో మధురానుభూతులు మిగిలి ఉంటాయి

 

 

 అందుకే కనుమ రోజు జరిగే మధురమైన క్షణాలను ఎవరు మిస్ కావద్దు. ఎంతపని ఉన్నప్పటికీ అలాంటి మధురమైన క్షణాలు మళ్ళీ మళ్ళీ రావు కదా... సంక్రాంతి దాటి కనుమ వచ్చిందంటే చాలు కోడి పందాలు ఎద్దుల పోటీలు బండిలాగుడు పోటీలు దాదాపు చాలా జిల్లాల్లో జరుగుతూనే ఉంటాయి. ఇక కోడి పందాలను వీక్షించడానికి ఎంతోమంది ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అక్కడి సరదాలను పంచుకోవడం ఓ మధురానుభూతి... మనం ఒంటరిగా నో లేక నలుగురితో కలిసి నిర్వహించుకునే సంబరాలు కావు ఇవి... తప్పకుండా కచ్చితంగా వీటిని మిస్ అవకుండా చూడాల్సినవి .

మరింత సమాచారం తెలుసుకోండి: