సంక్రాంతి పండుగ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అచ్చ తెలుగు... సంప్రదాయం ఉట్టిపడేలా తెలుగు ప్రజలందరూ జరుపుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో హడావిడి  మామూలుగా ఉండదు. ఇక ఈ హడావిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉంటుంది. హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు ఆడ పడుచుల రంగురంగుల రంగవల్లులు... అదిరిపోయే సాంప్రదాయ వస్త్రాలు ఇలా ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ నాడు కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముఖ్యంగా అల్లుళ్లు ఇంటికి వస్తూ ఉంటారు. అల్లులను మామలు ఇంటికి ఆహ్వానించడం వారికి సకల మర్యాదలు చేయడం చెబుతున్నారు. 

 

 

 ఇక పెళ్లయి  ఎన్ని ఏళ్ళు  అయినప్పటికీ కూడా మామలు మాత్రం అల్లుళ్లను  కొత్త అల్లుళ్ళు  గానే భవిస్తూ ఉంటారు.  ప్రతి ఏటా సంక్రాంతికి మామలు అల్లుళ్లను  ఇంటికి ఆహ్వానిస్తూనే ఉంటారు. ఇక సంక్రాంతికి మామ  వాళ్ళ ఇంటికి పండక్కి  వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు కదా. మరదలు తో సరసాలు చేయడం... మామతో పంచ్ లు  వేయడం... అత్తలతో చిలిపి చేష్టలు చేయడం... మొత్తంగా సంక్రాంతి ని ఎంజాయ్ చేయడం... సంక్రాంతి పండుగ వచ్చిందంటే అత్తారింటికి చేరుకున్న అల్లుళ్లు అందరూ చేసేది ఇదే. ఇక అత్తారింటికి అల్లుడు చేరుకున్నారు అంటే అక్కడ ఫుల్లుగా పిండివంటలు ఉండాల్సిందే.

 

 

 అబ్బో పిండి వంటలు లేకుండా... నోరూరించే మటన్ చికెన్ లేకున్నా... మందు లేకున్నా సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చిన అల్లుళ్ళు హర్ట్  అయిపోతారు మరి. అందుకే అల్లుడు ఇంటికి చేరుకున్న అల్లుళ్లకు.. భారీగా పిండి వంటలు చేయడం... సుక్క ముక్క అన్ని తెచ్చి పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. అల్లుళ్లు వద్దు  మామయ్య చాలు అంటుంటే.. ఏ  పెట్టుకో అల్లుడు కొంచెమే కదా అంటూ  బలవంతంగా అల్లుళ్లకు   తినిపించడం సంక్రాంతి పండుగ అంటే ఇదంతా సందడి ఉంటూనే ఉంటుంది. అందుకే తమ కూతుళ్లకు పెళ్లి అయ్యి  ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కూతురు అల్లుళ్లను  మామ సంక్రాంతి పండక్కి ఆహ్వానించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: