ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం 3 రాజధానుల నిర్ణయం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. విపక్ష పార్టీలన్నీ జగన్ ప్రకటించిన  రాజదానుల  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇక అమరావతిలో కూడా తీవ్రస్థాయిలో రైతుల నిరసనలు తెలుపుతున్నారు. మూడు పంటలు పండించుకునే భూమిని అమరావతి నిర్మాణం కోసం త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి మారుస్తామంటే తమకు  భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు.దీంతో  అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. 

 

 

 ప్రతిపక్ష పార్టీలన్నీ రాజధాని రైతుల నిరసన లకు మద్దతు తెలుపుతూ జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ ఈ ప్రాంతంలో పర్యటించి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్న రైతులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... అమరావతి పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసి పెంచుకున్నారని విమర్శించారు. జగన్ విజయసాయి రెడ్డి మాత్రమే చర్చించుకుని  రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ఆంధ్రుల తలరాత రాస్తున్నారని మండిపడ్డారు. 

 

 

 రాజధాని మార్పు విషయంలో  కనీసం ఉప ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ సంప్రదించకుండానే మూడు రాజధానులు నిర్మించాలనే  నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాజధాని అమరావతి జోలికి రావద్దని వస్తే ఇక్కడి నుంచి మీ రాజకీయ పతనం ప్రారంభం అవుతుంది అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన హెచ్చరించారు. అంతే కాకుండా ఈ నెల 20న అసెంబ్లీని ముట్టడికి పిలుపునిచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రైతులందరూ అసెంబ్లీ ముట్టడికి తరలి రావాలని కోరారు. ఇకపోతే అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలు నిరసన బాట పట్టడంతో పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: