మనిషి బ్రతకడం నేర్చుకుంటున్నాడు, కాని ఎలా బ్రతకాలో మరచిపోతున్నాడు. అంతే కాకుండా దిన దినం విలువల్ని, వలువల్లా వదిలేస్తున్నారు. విశ్వాన్ని చుట్తి వస్తున్నాడు కాని తనలోని రోగాలకు సరైన మందులను సకాలంలో కనిపెట్టలేక పోతున్నాడు. ఎన్ని కోట్లు సంపాదిస్తున్న, ఎంతగా రాజభోగాలు అనుభవిస్తున్నా వచ్చే రోగాలను జయించలేక మరణిస్తున్నాడు. అంటే ఎప్పటికప్పుడు మనిషి వెంట మరణం నీడలా ఉంటున్న నిజాన్ని గ్రహించలేక భ్రమలో బ్రతుకుతున్నాడని అనుకోక తప్పదు.

 

 

ఇకపోతే మనుషులకు ప్రమాదం ప్రతి దానితో పోంచి ఉంది. కాని కొన్నీంటిని తన తెలివి తేటలతో అధికమిస్తుండగా కొన్నీంటిని జయించడం సాధ్యం అవ్వడం లేదు. ఎందుకంటే ఎంతగా జాగ్రత్త పడుతున్న కొత్త కొత్త జబ్బులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో స్వైన్‌ ఫ్లూన్‌ కొన్నేళ్ల క్రితం వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికించింది. దీని తర్వాత జికా వైరస్‌ ఇబ్బంది పెట్టింది. తాజాగా, కరోనా అనే వైరస్‌ ప్రపంచ దేశాలను టెన్షన్‌ పెడుతోంది. ఇకపోతే ఈ వైరస్ ప్రభావం చైనాలోని వుహాన్‌ నగరంలో అధికంగా ఉందట.

 

 

ఈ వ్యాధి బారిన ఇప్పటివరకు 40 మంది పడగా, వాళ్లలో ఇద్దరు చనిపోయారట. ఇటీవల ఈ నగరాన్ని సందర్శించిన జపాన్‌ యువకుడికి కూడా ఈ వైరస్‌ సోకిందని సమాచారం. ఇకపోతే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అంతే కాకుండా వారం క్రితం థాయ్‌లాండ్‌లో ఓ యువతి ఈ వైరస్‌ బారిన పడడం, ఇప్పుడు జపాన్‌ యువకుడికి కూడా ఇదే వైరస్‌ సోకినట్లు తెలియడంతో ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

 

అందుకే ప్రపంచ దేశాలకు హెచ్చరికలు పంపుతుంది. ఇక ముందుగా ఈ వ్యాధి జంతువుల నుంచి వ్యాపిస్తుందని అనుమానించారట, కానీ ఇది మనుషుల నుంచే మనషులకు వస్తుందని తెలియడంతో, అధికారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిని అప్రమత్తం చేశారట. ఇకపోతే విదేశాలకు వెళ్లాలనుకునే వారు, వెళ్లిన వారు తగిన జాగ్రత్తలు తప్పని సరిగ్గా తీసుకోవలసిందేనని  ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: