రాజధాని రగడ.. దీనికి నేటితో ఫుల్ స్టాప్ పెట్టేయనున్నారు సీఎం జగన్. గత నెల రోజులుగా అమరావతి రాజధాని గోల మాములుగా లేదు.. చంద్రబాబు రోజుకో విన్యాసం చేస్తూ.. ఒకరోజు అమరావతి కోసం నిధులను సేకరిస్తూ.. మరో రోజు ర్యాలీ అని ఇలా ఏదో ఒకటి చేస్తూ.. మరో వైపు అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ రైతులు ఆందోళన చేస్తు అమరావతి మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మరీనా సంగతి తెలిసిందే.                 

 

ఇలా రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. చంద్రబాబు డ్రామాలు ప్రదర్శిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుపై అడుగులు కాదు పరుగులు పెట్టిస్తుంది. ఈనేపథ్యంలోనే హైపవర్‌ కమిటీ.. సీఎం జగన్‌తో భేటీ కానుంది.ఈరోజు సాయింత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.           

 

అమరావతి రాజధాని రైతుల సమస్యలపై హైపవర్‌ కమిటీ సభ్యులు ఈ భేటీలో సీఎం జగన్‌తో చర్చించనున్నట్లు సమాచారం. కాగా, అంతేకాదు ఇప్పటికే జీఎన్‌ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలను హైపవర్‌ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించించింది. మూడు సార్లు సమావేశమైన హైపవర్ కమిటీ.. రెండు నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపారు.           

 

ఈ నేపథ్యంలోనే ఇవాళ చివరిసారిగా సీఎం జగన్‌తో భేటీ కానుంది. దీంతో జనవరి 20న జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే రాజధానుల అంశానికి సంబంధించిన ప్రత్యేక బిల్లును పాస్ చేయించాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. నేడు జరిగే భేటీతో రాజధాని గోలకు చెక్ పడనుంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: