కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం విభజించు పాలించు అనే నినాదాన్ని గట్టిగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను విడగొట్టాలనే సంచలన ప్రకటన చేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే జిల్లాలు విభజన చేసి తన మార్క్ ఏంటో నిరూపించుకున్న కేసీఆర్.. ఇపుడు తెలంగాణ రాష్ట్రరాజధాని హైదరాబాద్ ను విభజించి పాలించాలి అని భావిస్తున్నట్టు సమాచారం. తాజాగా సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రకటన అందుకు బలాన్ని చేకూరుస్తున్నట్టు  తెలుస్తోంది. 

 

హైదరాబాద్ నగరం.. భారతదేశంలో అభివృద్ధి చెందిన ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఉంది. హైదరాాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ఉంటూ ఐటీ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 50లక్షలకు పైగా జనాభాను తనలో ఇముడ్చుకొని ఉంది. విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి. అంతేకాదు హైదరాబాద్ పేరు చెప్పగానే ఘుమఘుమలాడే బిర్యానీ గుర్తుకువస్తుంది.  గోల్కొండ, చార్మినార్ లాంటి చారిత్రక  ప్రదేశాలను కలిగి ఉండి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే పర్యాటక రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇంకా అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. 

 

రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కొత్త భవనాలు, పర్యాటక ప్రదేశాలు, ఆటలు ఇలా విభిన్న రంగాల్లో హైదరాబాద్ విరాజిల్లేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెెలుస్తోంది. అందుకే హైదరాబాద్ ను విడగొట్టాలనే ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం.  ఇంకొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారబోయే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లోని ఇంకొందరు నేతలకు పదవులు లభించే అవకాశమే కాకుండా.. అభివృద్ధి వైపు అడుగులు వేయొచ్చు అనే భావనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తాయో చూడాలి.   హైదరాాబాద్ ను విడగొట్టాలనే నిర్ణయం అధికారికంగా విడుదలైతే పరిణామాలు ఎలా ఉంటాయే చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: