సమాజంలో కోపం ఒక మనుషులకే కాదు, ప్రతి జీవికి ఉందని అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇకపోతే మీరు కుక్కల ప్రతాపం గురించి వినే ఉంటారు. ఎన్నో సార్లు ప్రత్యక్షంగా చూసే ఉంటారు. అలాగే కోళ్లకు ఉన్న కోపం ఎప్పుడైనా మీ కంట పడిందా. అందులో కోడిపుంజు పట్టలేని ఆగ్రహంతో ఊగిపోవడం ఎప్పుడైనా చూశారా. చూసి ఉండరు. ఎందుకంటే ఆ అవి చిన్న కోడిలే కదా అవి ఎవర్ని ఏం చేయలేవనుకుంటారు. 

 

 

కోడి పుంజులు గాని కోడి పెట్టెలు గాని సాధరణంగా తిరగబడవు. ఒక్క సారి అవి బరిలోకి దిగాయంటే ప్రత్యర్ధి ఎలాంటి వారైనా పరుగులు పెట్టిస్తాయి. ఇక పిల్లలున్న కోడి ఐతే తన దగ్గరికి ఎవరైన వెళ్లితే ముక్కుతో పొడుస్తుంది. ఇకపోతే ఇక్కడ కనిపించే వైరం ఎన్ని జన్మల నుండి వస్తుందో తెలియదు గాని శత్రువు చేతికి చిక్కితే సామిరంగా చిత్తడైపోవలసిందే అన్నట్టుగా సాగిన ఈ పోరును చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. అలాగే యుద్దం చేయాలంటే కావలసింది భారీ ఆకారం కాదు ధైర్యం అని నిరూపిస్తుంది.

 

 

ఎందుకంటే ఒక కోడి తన కాలి గోళ్ల పంజాతో  ఒక కుక్కను కుక్కలా పరిగెత్తించింది. ఏ మాత్రం భయపడకుండా చేసిన ఆ పోరాటంలో ఆ కుక్క తోక ముడిచి పొలం గట్ల వెంట పరుగులు తీసింది. ఇది వీరికి ఎప్పటి నుండి ఉన్న శత్రుత్వమో తెలియదు గాని కోళ్ల పందాలల్లో సంక్రాంతి బరిలోకి దిగిన కోళ్లు కూడా ఇంతలా పోరాటం చేయవు కావచ్చూ. ఈ కోడిని కనుక బరిలోకి దించితే తప్పకుండా గెలిచి తీరుతుందనిపిస్తుంది. నేను చెప్పడం కాదు. ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.

 

 

ఈ కోడిలో ఇంతకాలం దాగున్న కట్టప్ప ప్రతాపాన్ని ఒక రేంజ్‌లో చూపించింది. దీన్ని కనుక రాజమౌళి లాంటి డైరెక్టర్ చూస్తే తప్పకుండా ఒక సినిమాగా తెరకెక్కించేలా వెనకడుగు వేయకుండా పోరాడి విజయాన్ని సాధించి కోడి పుంజా మజాకా అని పిరికి వాళ్లను వెక్కిరిస్తుంది. వైరల్‌గా మారిన ఈ పోరును మీరు చూసి ఎంజాయ్ చేయండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: