తానొక్కడినే ప్రజలకోసం పాటుపడిపోతున్న వ్యక్తిగా, నిరంతరం శ్రమించే వ్యక్తిగా తనను తాను నిరూపించుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ విధంగానే ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ చంద్రబాబు చేయని హడావుడి లేదు. అదిగో రాజధాని ఇదిగో రాజధాని అంటూ హడావుడి చేస్తూ గ్రాఫిక్స్ లో రాజధాని బొమ్మలు చూపిస్తూ, రాజధాని ప్లాన్లను పరిశీలించేందుకు విదేశీ పర్యటనలు చేస్తూ ఐదేళ్ల పాటు హడావుడి చేశారు. దానికి తగ్గట్టుగానే టీడీపీ అనుకూల మీడియాలో కూడా రాజధాని పై అప్పటి టీడీపీ ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసేస్తోంది అన్నట్టుగా ప్రచారం బాగా చేయించారు. కానీ చంద్రబాబు హయాంలో కేవలం తాత్కాలిక భవనాల నిర్మాణం వరకే సరిపెట్టారు.

 

 ఇక రాజధానిపై కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఐదేళ్లపాటు రాజధాని వ్యవహారాలు సాగిస్తూ వచ్చారు. ఇక రాజధాని నిర్మాణానికి సలహాలు కమిటీలు వేస్తూ, చేసింది ఏమీ లేకపోయినా మొత్తం అమరావతిని తానే నిర్మించేశాను అన్నట్టుగా బాగా హైప్ సృష్టించుకున్నారు. అయితే బాబు హయాంలో చేసిన అభివృద్ధి ఏమి కనిపించడం లేదు. ఇప్పుడు అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా జగన్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టగానే తాను నిర్మించిన గ్రాఫిక్స్ రాజధాని కూలి పోతుంది అన్నట్టుగా చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే చంద్రబాబు కొంతమంది రాజధాని రైతులను అడ్డంపెట్టుకుని ఎక్కడలేని రాద్ధాంతం చేస్తున్నారు. 

 

వాస్తవంగా అయితే ఆ ప్రభుత్వ హయాంలో జరిగింది ఏమీ లేదు అనే విషయం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా బాగా అర్థమైన విషయమే. అయినా తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ విమర్శలు మూట కట్టుకుంటున్నారు. కేవలం తాత్కాలిక భవనాల నిర్మాణం కోసమే వేల కోట్లను ఖర్చు పెట్టారు. అసలు చంద్రబాబు హయాంలోనే రాజధానిలో శాశ్వత రాజధాని నిర్మించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తేది కాదు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: