గత నెల రోజుల నుండి రాజధాని అమరావతిలో రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  ప్రకటన అసెంబ్లీ వేదికగా చేసినప్పటి నుండి  రాజధాని రైతులు నిరసన బాట పట్టారు. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను త్యాగం చేశామని ఇప్పుడు రాజధాని అమరావతి నుండి తరలిస్తాం అంటు తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆరోపిస్తూ ధర్నాలు రాస్తారోకోలు చేపడుతున్నారు. దీంతో అమరావతి  ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. అయినప్పటికీ వెనక్కి తగ్గని అమరావతి రైతులు రోజు రోజుకు నిరసనలు  మరింత ఉధృతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రాజధాని రైతులు. 

 


 ఇక రాజధాని అమరావతిలో రైతులు చేస్తున్న నిరసనలకు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అమరావతిలో పర్యటిస్తూ రైతుల నిరసన లకు మద్దతు తెలుపుతూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి అభివృద్ధి చేయడం చాత కాక జగన్ సర్కార్  3 రాజధానిల అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలను మభ్య పెడుతుందని అంటూ ఆరోపిస్తున్నారు చంద్రబాబు. రాజధాని నిర్మాణం కోసం రైతుల భూములు త్యాగం చేశారని వారి త్యాగాన్ని జగన్ సర్కార్ గంగలో  కలిపేసింది అంటూ విమర్శిస్తున్నారు చంద్రబాబు. 

 


 మూడు రాజధానులు నిర్మిస్తే కొత్తగా భవనాలు నిర్మించాలని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెబుతున్న జగన్ సర్కార్ కొత్త కట్టడాలను ఇలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం అమరావతిలో రాజధాని కొనసాగించడం వల్ల కొత్తగా అభివృద్ధి చేయాల్సినది  ఏమీ లేదని ప్రస్తుతం హైకోర్టు అసెంబ్లీ తదితర వాటికి భవనాలు ఉండటం వల్ల పైసా ఖర్చు లేకుండానే అమరావతిలో రాజధాని కొనసాగించవచ్చని చంద్రబాబు చెబుతున్నారు. అయితే చంద్రబాబు అండ్ కో చెపుతున్న మాటలను బట్టి ఇప్పుడు ఉన్న భవనాల తోనే పని చేయవచ్చని ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు ఇక్కడే రాజధానిని  కొనసాగించాలని అంటున్నారు. మరి అలాంటప్పుడు రైతుల నుంచి తీసుకున్న భూముల్లో మిగిలిన వాటిని తిరిగి ఇస్తే తప్పేంటి అనే ప్రశ్న కూడా తెర మీదికి వస్తుంది. కానీ దీనికి సమాధానం మాత్రం ఎవరు చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: