సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కే తారాకరామారావుకు.. తన సొంత ఇలకాలోనే కుంపటి రగులుతున్నట్లుగా కనిపిస్తుందట. ఎందుకంటే ఇప్పటికే పార్టీలు మారినా వలస నేతలు పదవుల కోసం, అధికారం కోసం ముందు వరుసలోకి రావడంతో బల్దియాలో అసలైన గులాబీ నేతలకు టిక్కెట్లు దక్కదం లేదని వాపోతున్నారట. సిరిసిల్లలో ఒకనాడు కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, పార్టీల్లో ఉండి, మంత్రి కేటీఆర్‌తో సహా టీఆర్‌ఎస్‌ పార్టీని దుమ్మెత్తి పోసిన నాయకులందరూ ఇప్పుడూ గులాబీ గూటిలో సేద తీరుతున్నారు.

 

 

కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా నియోజకవర్గంలోని ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, మండలాలతో పాటు సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు మోసిన ఎంతోమంది కార్యకర్తలు, నాయకులకు ఇప్పుడూ అన్యాయం జరుగుతోందని బాహటంగానే చెప్పుకుంటున్నారట.. ఇకపోతే సిరిసిల్లలో గతంలో 33 వార్డు లు ఉండగా.. ప్రస్తుతం 39 వార్డులకు పెరిగాయి. ఇక గత కౌన్సిల్‌లో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, స్వతంత్రులుగా గెలిచిన కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఇకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్‌లో అందరిని సమన్వయ పరుస్తూ ఎవరూ నాయకత్వం వహిస్తున్నారనేది తేలని ప్రశ్నగానే ఉంది.

 

 

ఇక్కడ ఉన్న నాయకులు ఎవరికి వారే గొప్ప నాయకునిగా చెలామణీ అవుతున్నారు. ఇక కొందరైతే కేవలం మంత్రి కేటీఆర్‌తో అనుబంధం పెంచుకోవాలనే తాపత్రయం పడడం మినహా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల నుంచి గ్రామీణ ప్రాంతాల కార్యకర్తలను, కిందిస్థాయి నాయకులను సమన్వయం చేసే వారే లేరని చెప్పుకునే విధంగా తయారయ్యారట.. అంతే కాకుండా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నామి నేట్‌, పార్టీ పదవులను అనుభవిస్తున్నావారు సైతం తమ పరిధిదాటి పార్టీలో వ్యవహరించడం లేదనే వార్త గుప్పుమంటుందట..

 

 

ఇకపోతే పార్టీలో ముఖ్యనాయకులుగా చెప్పుకునే వారి మధ్య కూడా సమన్వయ లోపం సృష్టంగా కనిపిస్తుందట. ఇటువంటి సమస్యలు గులాభికి గుదిబండలా తయారవుతున్న సమయంలో ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎలక్షన్స్ ఒకరకంగా కేటీఆర్ కు తలనొప్పిగా తయారైనట్లే అని కొందరు అనుకుంటునారట. ఇకపోతే ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌ స్వయంగా జోక్యం చేసుకోక పోతే తగిన మూల్యం చెల్లించు కోక తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోందంటున్నారు కొందరు అసహనంతో ఉన్న నాయకులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: