అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చేస్తుంది. ఈ సేల్ రిపబ్లిక్ డే కు ముందు జనవరి 19 నుంచి 22 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ తో కొనసాగుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం స్పెషల్ గా ఈ సేల్ జనవరి 18 మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభమవుతుంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కోసం అమెజాన్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో భాగస్వామ్యం అయ్యింది. 

 

దీని కింద వినియోగదారులకు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చేసిన ఫోన్లు కొనుగోళ్లకు 10శాతం  తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ సేల్ సమయంలో, మీరు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కెమెరాలు, టీవీలు మరియు ఇతర గాడ్జెట్ల కొనుగోలుపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ గ్రేట్ ఇండియన్ సేల్‌లో అమెజాన్ 40 శాతం వరకు తగ్గింపుతో మొబైల్ ఫోన్‌లను అమ్ముతుంది. అలాగే దానితో పాటు ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉంటె మరో 10శాతం అంటే ఫోన్లపై 50శాతం డిస్కౌంట్ ఉంటుంది. 

 

కాగా ఈ సేల్ సమయంలో, స్మార్ట్ ఫోన్లకు 40% వరకు తగ్గింపు లభిస్తుంది అలాగే ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ , ఎక్స్ చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ మొదలైన ప్రయోజనాలు కూడా వస్తాయి. అలాగే, యాపిల్, షావోమి, వన్ ప్లస్, శామ్సంగ్, వివో, హానర్ వంటి బ్రాండ్ల ఫోన్లలో మంచి డీల్స్ ఉంటాయి. 

 

అమెజాన్ వెబ్సైట్ యొక్క టీజర్ పేజీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్లో అమెజాన్ స్పెషల్ లాంచ్ కూడా ఉంటుంది. అంతేగాకుండా అమెజాన్ ఫ్యాషన్ విభాగంలో 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో బట్టలు, చెప్పులు, గడియారాలు  బ్యాగ్స్-సామాన్లపై ఈ డిస్కౌంట్ ప్రకటించింది. టీవీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు, ఎయిర్ కండిషనర్లు పై  40 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: