మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ , వైసీపీ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జి ఎర్రగడ్డ వెంకట్రావుల మధ్య ఆధిపత్య పోరు నడిచేది. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి వైసీపీలో చేరకపోయినా ఆ పార్టీకి మద్దతు దారుడిగా ఉంటూ వస్తున్నారు . వంశీ వైసీపీకి దగ్గరవుతుండడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు తన నిరసనను మొదట్లో బహిరంగంగానే అధిష్టానం ముందు వ్యక్తం చేశారు. స్వయంగా జగన్ యార్లగడ్డను పిలిచి పరిస్థితులను వివరించి కీలకమైన పదవి ఇచ్చే అంశంపై హామీ ఇచ్చారు. దీంతో వెంకట్రావు సైలెంట్ అయ్యారు. అయినా తెర వెనుక మాత్రం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది.


 ఈ విషయం ఇప్పుడు సంక్రాంతి సంబరాల సందర్భంగా మరోసారి బయటపడింది.  సంక్రాంతిని పురస్కరించుకొని గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం అంపాపురం లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదాల శిబిరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్గం కు చెందిన శిబిరంపై పోలీసులు దాడి చేయడంపై ఇప్పుడు రచ్చ మొదలైంది. పక్కపక్కనే రెండు శిబిరాలు ఉన్నా ఒక దాని పైన దాడి జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసిపి నియోజకవర్గ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి చెందిన వారు గ్రామంలో రోడ్డుపక్కనే కోడిపందాల శిబిరం ఏర్పాటు చేశారు. దాని వెనుక గా ఎమ్మెల్యే వంశీమోహన్ వర్గీయులు శిబిరం ఉంది కానీ పోలీసులు రోడ్డు పక్కన ఉన్న ఎర్రగడ్డ వర్గీయులు శిబిరాన్ని వదిలివేసి వంశీ దాడులు నిర్వహించడం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 


అయితే దీనిపై పోలీసులు స్పందిస్తూ ఆ ఒక్క శిబిరం పైన ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఒక్కచోటే దాడులు నిర్వహించామని చెబుతున్నారు. చాలా కాలంగా అంపాపురం లో సంక్రాంతి పండుగ సందర్భంగా వల్లభనేని వంశీ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు పందాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా ఏర్పాటు చేశారు. సంక్రాంతి రోజు రాత్రి వంశీ వర్గానికి చెందిన శిబిరాలపై పోలీసుల దాడి చేసి ఏడు లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న శిబిరాన్ని వదిలిపెట్టి వంశీ అనుచరుల శిబిరాలపై దాడులు చేయడం వెనుక వైసీపీలో వర్గ పోరు ఉందనేంది బయటపడింది. ఒకరిపై ఒకరు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: