రాష్ట్రంలో రాజకీయాలంటే పేకాట ముక్కల్లా మారాయి. సీట్లు పంచుకోవడం స్వీటు ముక్కలకంటే అద్వాన్నంగా తాయారైయ్యాయి. ప్రజలను పాలించమని ఓట్లు వేస్తే, ప్రజల రెక్కలు ముక్కలు చేస్తూ అందినంతగా వెనకేసుకుంటున్నారు మన నాయకులు. పదవులంటే వారసత్వ ఆస్తుల్లాగా పంచుకుంటున్నారు. నాయకుడన్న వాడు ప్రజల కోసం ఉండాలి కాని నేటికాలంలో ప్రజలే నాయకుల కోసం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు..

 

 

ప్రస్తుత పరిస్దితుల్లో రాజకీయమంటే రాబందుల ఆటలా మారిందనుకుంటున్నారు.. ఇంతగా వివరణ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే పొత్తులు పెట్టుకోవలసిందే అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ పొత్తులు పెట్టుకోకుంటే తమ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందనేది కొందరి నాయకుల అభిప్రాయమట. అందుకే కొందరు నాయకులు పొత్తులకు తొత్తులుగా మారారని అనుకుంటున్నారట ప్రజలు.  ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ తమకి మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీ అని కొన్నాళ్ల కిందట అసెంబ్లీలోనే ప్రకటించారు.

 

 

అయితే, అధికారికంగా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లకు సంబంధించి ఎలాంటి చర్చలు జరిగినట్టు ప్రకటనలు లేకపోయినా… ఫ్రెండ్లీగా కలిసి మెలిసి మున్సిపల్ ఎన్నికల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నారట. ఇందులో భాగంగా డమ్మి అభ్యర్ధులను పెట్టుకుని ఒకరికొకరు అన్నట్లుగా వేరే పార్టీవారికి సందు ఇవ్వకుండా రాజకీయ గేం తో ముందుకు వెళ్లుతూ సీట్లను సర్ధుబాటు చేసుకుంటున్నారట. కొన్ని సందర్బాల్లో వీరి అవగహనను లోతుగా పరిశీలిస్తే ఈ రెండు పార్టీల మధ్య ఎంతటి రాజకీయ అవగాహన ఉందనేది స్పష్టమౌతుందంటున్నారు కొందరు.

 

 

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్.ఐ.ఎమ్  47 పట్టణాల్లో పోటీకి దిగి తమ అభ్యర్థులతో 441 వార్డుల్లో నామినేషన్లు వేయించింది. కాగా కేవలం 276 వార్డుల్లో మాత్రమే మజ్లిస్ అభ్యర్థులు ఉపసంహరణ తేదీ ముగిసేసరికి మిగిలారు. అంటే, 135 చోట్ల తమ అభ్యర్థులతో నామినేషన్లను మజ్లిస్ వెనక్కి తీయించేసింది. ఇక తెరాస కూడా ఇలానే.. భైంసాలో ముగ్గురు అభ్యర్థుల్ని రంగంలోకి దింపినట్టే దింపి, తరువాత వారితో నామినేషన్లను తీయించేసి, మజ్లిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేసింది.

 

 

ఇదే కాకుండా తెరాస, మజ్లిస్ పోటీ పడుతున్న మరికొన్ని స్థానాల్లో కూడా అధికార పార్టీ డమ్మీ అభ్యర్థులనే పెట్టి, ఒకరికి ఒకరు సాయం చేసుకునే దిశగా చాలా చోట్ల ఏర్పాటు చేసుకున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయట. అంతే కాకుండా మజ్లిస్ కొన్ని ఛైర్ పర్సన్ల సీట్లను దక్కించుకోవాలని  తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం.

 

 

ఇందులో భాగంగా ఇదే అంశమై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. మొత్తానికి ఎవరు ఏమనుకున్న మాదారి మాదే అన్నట్లుగా ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుని ముందుకు సాగడం రాజకీయ వర్గాల్లో చర్చాంశ నీయమైందట..

మరింత సమాచారం తెలుసుకోండి: