చాలామంది తరచూ రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కొంతమంది లాంగ్ జర్నీలు  చేయడానికి రైలు ప్రయాణం ఎంచుకుంటే ఇంకొంతమంది తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి రైలులో ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే రైలు లో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది ప్రయాణికులు కాస్త బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కూడా ట్రైన్ లో ఉన్నప్పుడు ఏదైనా ఎంటర్టైన్మెంట్ దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు కేంద్రం ఒక తీపి కబురు చెప్పింది. కేంద్రం చెప్పిన తీపి కబురు తో ఇక నుంచి రైలు ప్రయాణం ఉల్లాసంగా మారనుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఓవైపు రైల్వే నుండి కేంద్రానికి ఆదాయం పెరుగడంతో పాటు ప్రయాణికులకు కూడా మరింత ఉల్లాసం ఉత్సాహంగా రైల్వే ప్రయాణం మారనుంది.కేంద్రం  కంటెంట్ ఆన్ డిమాండ్ యాప్ ను  దశలవారీగా ప్రారంభించనుంది మంత్రిత్వశాఖ. 

 

 

 రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ఉంటుంది. ప్రయాణికులందరూ ఇది తమ స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ లేదా టాబ్లెట్లలో  డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ యాప్ లో వివిధ భాషలకు చెందిన సినిమాలు మ్యూజిక్ వీడియోలు వినోద కార్యక్రమాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులందరూ ప్రయాణ సమయంలో ఈ వీడియోలను చూడడానికి వీలు ఉంటుంది. కాగా  ఈ యాప్ లో ఉన్న కంటెంట్ ను రైల్  టెల్  ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన సర్వర్ తో హై స్పీడ్ వేగంతో స్ట్రీమ్ చేయవచ్చు. ఇందులో ఎలాంటి కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ కానీ డేటా ప్రాబ్లమ్స్ కానీ ఉండదు. స్టేషన్ మారిన కొద్దీ ఆటోమేటిక్గా కంటెంట్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఈ సేవలు  దేశంలోని 5573 రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉందని కేంద్రం తెలిపింది. 

 

 

 రైల్ టెల్  యాప్ కోసం ప్రీమియంగా లభిస్తుంది . అంటే రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఉచితంగా ఇందులో ఉండే కంటెంట్ ని చూడవచ్చు కానీ వీటిలో యాడ్స్  అందించడం ద్వారా రైల్వే ఆదాయాన్ని సంపాదిస్తుంది. అయితే ఇందులో ఉన్న ప్రీమియం కంటెంట్  చూడడానికి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. నిర్దేశిత మొత్తం చెల్లించి సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్లయితే ఈ కంటెంట్ ను  వీక్షించేందుకు. సబ్స్క్రిప్షన్ చేసుకున్న వారు కంటెంట్ చూస్తున్న సమయంలో అడ్వర్టైజ్ మెంట్స్ లాంటివి రావు. ఈ కంటెంట్ యాప్ అన్ని ప్రీమియం మెయిల్ మరియు ఎక్స్ప్రెస్  రైళ్లలో  అందుబాటులో ఉంటుంది. అలాగే అన్ని సబర్బన్ రైళ్లు, వైఫై రైల్వే ఎనేబుల్ద్  స్టేషన్లు లలో కూడా  అందుబాటులో ఉంటుంది. భారత రైల్వే లోని మొత్తం 17 జోన్లలో రైల్వే స్టేషన్ వైఫై నెట్ వర్క్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: