మహారాష్ట్రలోని ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన షిరిడి సాయి నిలయం లో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నది.  షిరిడి సాయినాధుని ఆలయాన్ని ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.షిరిడి సాయి నాధుని అసలు జన్మస్థలమైన పాత్రిలో షిరిడీ సాయినాధునికి సరికొత్త ఆలయం నిర్మిస్తామని  దీనికోసం ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయిస్తుంది అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా శిరిడి ఆలయానికి నుంచి మహారాష్ట్రలోని సాయినాధుని జన్మస్థలమైన పాత్రిలో  ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం గా మారాయి. 

 

 

 ఇకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శిరిడి సాయినాధుడు సంస్థాన్ ట్రస్టు సభ్యులు నేడు పట్టణ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షిరిడి సాయినాధుని ఆలయం కూడా మూసి వేస్తారని... షిరిడి సాయినాధుని ఆలయంలో పూజలు అన్నీ నిలిపివేస్తామని నిన్న వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన షిరిడి సాయి నాధుని సంస్థాన్ ట్రస్టు సభ్యులు సాయినాధుని ఆలయాన్ని మూసివేయడం లేదని యధావిధిగా పూజలు కొనసాగిస్తామని కానీ షిరిడి పట్టణంలో మాత్రం బంద్ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. 

 

 

 ఇకపోతే షిరిడి సాయినాథ్ జన్మస్థలం పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల షిరిడి వాసులందరూ భగ్గుమన్నారు. నేడు  నిరవధిక బంద్ కు  పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేడు శిరిడి పట్టణ వ్యాప్తంగా బంద్  పాటిస్తున్నారు ప్రజలు. ఆదివారం ఉదయం నుంచి శిరిడి లో ఏ ఒక్క హోటల్  కూడా తెరుచుకోలేదు. హోటళ్లు  దుకాణ సముదాయాలు వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. షిరిడి నగర ప్రజలందరూ స్వచ్చంధంగా బంద్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలపై ఆగ్రహిస్తున్న శ్షిర్డీవాసులు నిరసన తెలుపుతూ ఉండడంతో ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయని పలువురు భావిస్తున్నారు. షిరిడి నగరంలో మొత్తం టెన్షన్ టెన్షన్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: