అమ‌రావ‌తి.. ఈ పేరు 5 సంవత్సరాల ముందు ఏపీ ప్రజలకు కూడా తెలియదు.. కానీ ఆ పేరు ఉన్న ఊరు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయ్యింది. బాగా పంటలు పండుతున్న భూమిపై ఓ నర రూప రక్షేశుడి కన్ను పడి పచ్చని పంటలు నిప్పులల మారాయి. రాజధాని అయినా అమరావతిలో అది చేస్తాం.. ఇది చేస్తాం అని ప్రజలకు భ్రమలు కల్పించి ఏదో చెయ్యాలనుకున్నాడు చంద్రబాబు. 

 

అభివృద్ధి ఏది నాయన అని ప్రజలు అడిగితే ఇదిగో అని అమరావతిలో గ్రాఫిక్స్‌ చూపించాడు.. అమరావతి అని కోట్లు కోట్లు తిన్నాడు.. కానీ ఏమి ప్రయోజనం.. అమరావతి అని ఉన్న మంచి పేరును భ్రమరావతి చేశాడు చంద్రబాబు నాయుడు. అయితే ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం వచ్చింది.. కొత్త నాయకుడు వచ్చాడు.. అమరావతిని ఒక్కటే అభివృద్ధి ఎందుకు..? రాష్ట్రమంతా చేద్దాం అన్నాడు.. 

 

దీంతో గత నెల రోజులుగా అమరావతిలో రైతుల రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ గొడవ అంత కూడా చంద్రబాబు నాయుడు తన ఆస్తుల కోసమే రచ్చ రచ్చ చేస్తున్నాడు అని పాలకపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే ఇలా రచ్చ రచ్చ చేయిస్తున్నాడు అని కొందరు అంటున్నారు. అయితే ఇది అంత పక్కన పెడితే.. చంద్రబాబు నాయుడు వల్లే రాజధాని ఇలా దారుణంగా మారిపోయింది. 

 

అప్పట్లో అంటే.. వయసు అయిపోయిన వల్లే బాగా పరిపాలించగలరు అని ఒక పేరు ఉండే.. ఎందుకు ఉండే అంటే.. అప్పట్లో టెక్నాలజీ లేదు.. రాజు ఏమి చెప్తే అద అభివృద్ధి.. కానీ ఇప్పుడు ఆలా కాదు కదా! టెక్నాలజీ పెరిగింది.. దానికి తగ్గట్టు పరిపాలించే నాయకుడు ఉండాలి.. కానీ ఈ అవుట్ డేటెడ్ బాబు వచ్చి అవే ఆలోచ‌న‌ల‌తోనే అమ‌రావ‌తికి ఈ గతి పట్టింది... ఆంధ్రుల గతి ఆధోగ‌తే ఆయిపోయింది. అందుకే యువకులను ఎంచుకోవాలి అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: