ఈ నెల 22న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ విజయం వరించేలా ఎన్నో ఊహలు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు తెస్తున్నారు. ఎన్నికలు వచ్చాయి అంటే ప్రచార రంగంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులందరూ సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.ఇక అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లకు అనేక ఆఫర్లు అభ్యర్థులు ప్రకటిస్తున్నట్లు  సమాచారం.తమదైన  స్టైల్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చేయని ప్రయత్నం అంటూ లేదు. 

 


 ఇక ఎప్పటి లాగా కాకుండా కాస్త కొత్తగా ఆలోచిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు అభ్యర్థులు. ఖర్చు విషయంలో కూడా అటు పార్టీ అధిష్టానం నుంచి ఫుల్ గా సపోర్టు ఉండడంతో ఎంత ఖర్చు పెట్టడానికి అయినా వెనుకాడడం లేదు. అయితే ఇక్కడ ఒక అభ్యర్థిలు  ఎన్నికల్లో విజయం సాధించేందుకు మాస్టర్  ప్లాన్ వేసారూ . నల్గొండ జిల్లా చండూరు మండలం లక్కినేని గూడెం మూడో వార్డు పరిధిలో 800కు పైగా నివాసముంటున్నారు. మూడో వార్డు లో సుమారు 520 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలందరినీ గ్రామం నుండి తరలించడంతో ప్రస్తుతం ఆ గ్రామం బోసిపోయింది. 

 


 గ్రామంలోని ఓటర్లు అందరి సమీప కోళ్లఫారాలు కు తరలించిన అభ్యర్థులు... ఓటర్లకు సకల సౌకర్యాలు కల్పిస్తూ బుట్టలో  వేసుకునే పనిలో పడ్డారు. ఉదయం గ్రామం నుండి కోళ్ల ఫారాలకు  ఓటర్లను తరలించిన అభ్యర్థులు.. అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి బిందువు ఆపై మద్యం తదితర సకల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు సమాచారం. మందు కొట్టిన తర్వాత ఎలాంటి వివాదాలు తలెత్తకుండా కూడా ఏర్పాటు చేశారట అభ్యర్థులు. ఇవన్నీ పూర్తయిన అనంతరం.. ఇంటికి పంపిస్తారు అనుకుంటున్నారేమో.. కాదు కాదు... ఇతర షెడ్ల లో విశ్రాంతి తీసుకునేందుకు కూడా ఏర్పాట్లు  చేశారట. తెలంగాణలో నేడు ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో ... ఈ ఒక్కరోజు కూడా ఎంత మంది ఓటర్లు ఆకట్టుకుంటే అంత విజయం చేరువ అవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: