జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి తన మద్దతు తెలుపుతూ జనసేన పార్టీకి చుక్కలు చూపిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఉంది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను పవన్ వ్యతిరేకిస్తున్నా రాపాక మాత్రం సమర్థిస్తూ ఉండడం చాలా కాలంగా పవన్ కు మింగుడు పడడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే ను దూరం చేసుకుంటే ఆయన మరింతగా తమపై విమర్శలు చేసే అవకాశం ఉందని భావించిన పవన్ సైలెంట్ గానే ఉంటున్నారు.


 ఆయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిసినా రాపాకను కొద్ది రోజుల క్రితం పార్టీకి సంబందించిన పదవుల్లో కూడా నియమించారు పవన్. ఏపీలో మూడు రాజధానుల  వ్యవహారం తీవ్రతరమైన నేపథ్యంలో జగన్ కి రాపాక జై కొట్టారు. ప్రస్తుతం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో, మూడు రాజధానులు సంబంధించి కీలక బిల్లులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్ కు లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ఏపీ రాజధానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించినట్లుగా పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు.


 దీనికి సంబంధించి జనసేన పార్టీ తరఫున లేఖను కూడా రాపాకకు పంపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, బిల్లులలను వ్యతిరేకించాలని పవన్ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అందులో మీరు అసెంబ్లీ సమావేశాలకు తప్పక హాజరుకావాలని, అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అయితే పవన్ లేఖపై ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇంకా తెలియలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన జనసేన పార్టీతో తనకు సంబంధం లేదు అన్నట్టుగా, ఆయన స్వతంత్ర ఎమ్మెల్యే గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మాటను ఆయన ఎంతవరకు లెక్కచేస్తారనే అనుమానం అందరిలోనూ ఉంది.

janasena Chief @PawanKalyan open letter. pic.twitter.com/ban9Bgjtyr

మరింత సమాచారం తెలుసుకోండి: