టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ భవిష్యత్తుకు పుల్ స్టాప్ పడినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే నారా లోకేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే గా పోటీచేసిన నారా లోకేష్ వాక్చాతుర్యానికి తట్టుకోలేక... ఆయన మాస్టర్ మైండ్ భరించలేక మంగళగిరి ప్రజలు లోకేష్ కు భారీ ఓటమి కట్టబెట్టారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా నారా లోకేష్ కొనసాగుతూనే ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం నిర్మించతలపెట్టిన 3 రాజధానిలకి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది నేడు  శాసన మండలికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అమరావతి నుండి రాజధాని తరలిపోయింది అనే భావనతో.. టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్  తన పదవికి చేశారు.  

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన డొక్కా మాణిక్య వరప్రసాద్... అమరావతి నుండి రాజధాని విడి పోయింది అన్న బాధతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు . ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను అని  స్పష్టం చేశారు. జగన్మోహన్ 3రాజధానిల  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అంటూ చెప్పారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం నారా లోకేష్ పరిస్థితి ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని తరలిపోవడానికి నిరసనగా తాడికొండ కు చెందిన టిడిపి నేత డొక్క రాజీనామా చేయగా..  మరి అదే రాజధాని ఏరియాలో మంగళగిరి ఇన్చార్జిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తన ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటాడా లేదా అన్నది ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న. 

 

 

 గతంలో ఎమ్మెల్సీగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అన్నం సతీష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి... నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే లొకేష్ ను  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. కానీ నారా లోకేష్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ తన ఎమ్మెల్సీ పదవిని  మాత్రం అంటి పెట్టుకొని ఉన్నాడు. అంతెందుకు సోమిరెడ్డి లాంటి వాళ్లు కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకుని ఉండే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. అక్కడ ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవికి మాత్రం  రాజీనామా  చేయలేదు. ఇక ఇప్పుడు రాజధాని విషయంలో తాడికొండ కు చెందిన డొక్కా రాజీనామా చేశారు. దీంతో లోకేష్ కూడా  రాజీనామా చేస్తాడా.?  అంత దమ్ముందా.?  ఒకవేళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే మళ్ళి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అయితే లేదు... ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా లేవు.. దీంతో ఎంత మంది రాజీనామా చేస్తే నాకేంటి అనుకొని పదవీకాలం పూర్తి అయ్యేంతవరకూ ఎమ్మెల్సీ పదవిని   నారా లోకేష్ మాత్రం అంటి పెట్టుకొని ఉంటాడు అంటున్నారు వైసీపీ నేతలు చూడాలి మరి నారా లోకేష్ ఏం చేస్తాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: