ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని రైతులు అందరు తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేశామని అలాంటిది ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని మారుతుంది  అంటే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నో రకాలుగా నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేపట్టారు.  రైతు కుటుంబాలు  మొత్తం రోడ్ల పైకి చేరి భారీ ఎత్తున ధర్నాలు చేపట్టారు. దీంతో గత నెల రోజులుగా రైతుల నిరసనలతో అమరావతి మొత్తం అట్టుడుకిపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధాని లకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రాజధాని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి  ఒక్క రైతుకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన రాయితీల కంటే అధిక పరిహారంతో పాటు.. మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ అమరావతి రైతుల  అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం అంటూ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

 

 

 మరోవైపు అసెంబ్లీ వద్ద రాయలసీమ ప్రజాప్రతినిధులు కూడా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవగా...  వాళ్ళతో కాసేపు ముచ్చటించారు సీఎం జగన్. ఇదిలా ఉంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అయితే ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లు  శాసనమండలికి వెళ్ళింది. అయితే అక్కడ మాత్రం బిల్లుకి  చుక్కెదురైంది.శాసన మండలి దాదాపు  ఏడు గంటలు  రసాభాసగానె కొనసాగింది. ఏకంగా చరిత్రలోనే తొలిసారిగా మంత్రులు వెళ్లి శాసనమండలి చైర్మన్ పోడియం దగ్గర నినాదాలు చేశారు. దాదాపు 7 గంటల తర్వాత శాసనమండలిలో మూడు రాజధానిల బిల్లును ప్రవేశపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: