ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల  అంశం హాట్ టాపిక్ గా మారింది. అటు శాసనసభలో కానీ ఇటు శాసన మండలిలో కానీ దీనికి సంబంధించిన బిల్లు పైనె చర్చ కాదు కాదు రచ్చ  జరుగుతోంది. దీనిపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు.. ప్రశ్నోత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. శాసనసభలో  భారీ మొత్తంలో మెజారిటీ ఉండడంతో సులభంగానే అభివృద్ధి వికేంద్రీకరణ సహా సిఆర్డిఏ రద్దు బిల్లుకు ఆమోదం ముద్ర వేయించింది జగన్ సర్కార్ కానీ ఈ రెండు బిల్లులకు సంబంధించి శాసన మండలిలో మాత్రం జగన్ సర్కార్ క చుక్కేదురయింది. జగన్ సర్కార్ కు  శాసనమండలిలో మెజార్టీ తక్కువగా ఉండడంతో టీడీపీ ఎమ్మెల్సీలు అందరూ ఈ రెండు బిల్లులను వ్యతిరేకించారు. ఇక ఎట్టకేలకు మంత్రుల నినాదాలతో శాసనమండలిలో ఈ రెండు బిల్లులను  ప్రవేశపెట్టారు. 

 

 

 ఇదిలా ఉంటే దీనిపై టీడీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్క రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండటం ఏమిటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల  నిర్మాణానికి సంబంధించి టిడిపి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశించినంత సులభంగా మూడు రాష్ట్రాల ఏర్పాటు జరగదు అని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంవల్ల ప్రజాధనం వృధా అవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు అంటూ మండిపడ్డారు జెసి దివాకర్ రెడ్డి. 

 

 

 శాసనసభ నుంచి వచ్చిన తీరు మాత్రం అందరూ గౌరవించాల్సిందే అంటూ స్పష్టం చేశారు. కృష్ణానది ఎగువన చాలా ప్రాజెక్టులు నిర్మించారు అని వ్యాఖ్యానించిన జేసీ దివాకర్ రెడ్డి... అమరావతి కి ఎటువంటి వరద ముప్పు ఉండదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అటు కేంద్రానికి నివేదికల పంపుతారని...  బ్రెయిన్ మాత్రం విశాఖలో పెడతాడు అంటూ ఆయన శైలిలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తలకాయ అయితే... జగన్ చెబుతున్న సెక్రటేరియట్ రాజధాని విశాఖ అని... అది లేకుండా ఏం ఉపయోగం అంటూ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: