మనం ఇన్నాళ్లు కేవలం హోస్టెస్ ను విమానాలలోనే చూశాం.. కానీ ఇప్పుడు రైలులో కూడా చూస్తున్నాం. మన భారత్ అభివృద్ధి అవుతుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది? ఎక్కడ ఉంది? చెప్పండి మీరే..  విమానాలలో ప్రయాణించే ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి.. వారికీ కావాల్సిన ఆహార పదార్దాలను ఇవ్వడానికి ఎయిర్ హోస్టెస్ లు ఉంటారు. 

 

ప్రయాణికులు వారి గమ్యస్థానంకు చేరే వరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఎయిర్ హోస్టెస్ లు చూసుకుంటారు.. అయితే విమానం ఎక్కినప్పటి నుండి.. ఎలా కూర్చోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. ఆలా ప్రయాణికులు అందరూ హ్యాపీగా ఉండేలా వారు చూసుకుంటారు.

 

ఈ నేపథ్యంలోనే అలానే.. రైలులో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఆనందంగా.. అన్ని సౌకర్యాలు పొందేలా.. ఉండాలని ఓ కార్పొరెట్‌ రైలుని ప్రారంభించింది. ఆ రైలు ఏదో కాదు తేజస్ ఎక్సప్రెస్. రైల్వేశాఖ కార్పొరెట్‌ రైళ్లను ప్రారంభించింది. ఆలా ప్రారంభించినప్పుడు మొదటి కార్పొరేట్ రైలు లక్నో–న్యూఢిల్లీల మధ్య మొదలైంది.

 

జనవరి 19, 2020 నుండి రెండవ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ అహ్మదాబాద్‌ నుంచి ముంబైకు మొదలైంది. అయితే ఈ ఖరీదైన రైళ్లలో స్పెషల్ ఏంటంటే.. ట్రైన్ హోస్టెస్. ట్రైన్ హోస్టెస్ ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి.. విమానంలో ఎయిర్ హోస్టెస్ ఉన్నట్టే ఇక్కడ ట్రైన్ హోస్టెస్ ఉంటారు. మహిళలను ప్రోత్సహించడానికి ఈ ఉపాధిని తేజస్ ఎక్సప్రెస్ వారు కల్పించారు. 

 

అయితే విమానంలో ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్ తో ప్రవర్తించినట్టు.. రైలులో ప్రయాణికులు ట్రైన్ హోస్టెస్ తో ప్రవర్తించడం లేదు.. ట్రైన్ హోస్టెస్ లను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు.. మాటకు కాలింగ్ బెల్ కొడుతున్నారు.. తీరా అక్కడికి వెళ్తే.. అది పని చేస్తుందో లేదో చూస్తున్నాం అంటున్నారు.. సెల్ఫీలు తీస్తున్నారు.. వీడియోలు తీస్తున్నారు. ఇలా ప్రతి ఒకటి వరెస్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. 

 

ఈ కష్టం గురించి రైల్వే శాఖ యాజమాన్యానికి తెలిసి వారిని కఠినంగా శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్రైన్ హోస్టెస్ ప్రయాణం అవ్వగానే ఫీడ్ బ్యాక్ అడుగుతున్నారు. ఎవరైతే ట్రైన్ హోస్టెస్ ను ఇబ్బంది పెడుతారో వారిపై కఠిన చర్యలు తీసుకునేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది... మనం అయినా కూడా అమ్మాయిలను ఇబ్బందులు పెట్టకూడదు.. మన అమ్మాయిలు ఎదుగుతున్నారు అని అనుకోవాలి కానీ ఇలా ఇబ్బందులకు గురి చెయ్యకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: