ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎలా మారాయంటే ప్రాణాలకన్నా ఎక్కువైపోయాయి. ప్రచారాల్లోనే బలాబలాలు తేల్చుకుంటుండగా, అవి ముగిసాగ పోలింగ్ బూత్‌లో కూడా యుద్దాలు చేస్తున్నారు. పదవులు అంటే పడి చచ్చే నాయకులు వీటి కోసం కొన్ని కొన్ని సార్లు అడ్దమైన పనులు కూడా చేస్తున్నారు. చేపిస్తున్నారు. ఇకపోతే గెలిచిన నాయకుడు ఓటర్‌కు ఏదో చేస్తాడని అనుకుంటాడు. కానీ గెలిచాక, ఓటర్ పరిస్దితి గేటుబయటే. ఎందుకంటే, ఓటర్ వేసే ఓటుకు నోటు లంచంగా తీసుకోకుంటే, గెలిచిన  నాయకుని గల్ల పట్టి అయినా  నిలదీయవచ్చు.

 

 

కాని మన ప్రజాసామ్యంలో అవినీతి అనేది బలంగా నాటుకుంది కదా. అందుకే గొంతులోకి చుక్క, జేబులోకి నోటు ఈ రెండు పెట్టి ఓటర్ల నాడి పట్టిన నాయకులు ఓట్లు గుద్దించుకుంటున్నారు. ఇకపోతే బరిలో నిలిచిన నాయకుని కోసం అతని అనుచరులు గాని, అతని సానుభూతిపరులు గాని తన్నుకోవడం తెలుసు. కాని ఏకంగా మనిషిలోని అవయవాలను కూడా నాయకుల కోసం గాయపరచడం దురదృష్టకరమైన విషయమే.

 

 

ఎందుకంటే నీ అభ్యర్ధిని గెలిపించడం కోసం నువ్వు త్యాగం చేస్తే, అతను గెలిచాక నిన్ను త్యాగం చేస్తాడు. మరెందుకు ఒక మాటమీద ఉండని ఊసరవెల్లి రాజకీయాల గురించి సామాన్యులు తన్నుకోవడం అని ఎవరైనా ఆలోచిస్తారా. ఆలోచించరు. ప్రజలు ఇలా ఉన్నంతకాలం నాయకులు కూడా ఇలా వాడుకుంటారు, నిండా ముంచుతారు. ఇకపోతే ఇక్కడ ఒక ఘటన గురించి చెప్పాలి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌లో మాట మాట పెరిగి కొట్లాటకు దిగిన అభ్యర్దుల్లో ఒకతను, తన ప్రత్యర్ధి వర్గం అతని ముక్కును కసక్కుమని కొరికాడట. నల్లి బొక్కలా కనపడిందేమో అతనికి అందుకే ఇలాంటి పని చేశాడు.

 

 

ఇక నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఈ సంచలన ఘటన చోటు చేసుకుంది.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గీయుల మధ్య కొట్లాట జరిగి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, చిన్నగా మొదలైన వివాదం పెద్దదై గల్లలు పట్టుకుని తన్నుకునే దగ్గరికి వెళ్లిందట. అంతలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్.. ఇమ్రాన్ ముక్కును కొరికాడు. ఇక బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించి, పోలీసులు ఇలియాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: