ఏపీ రాజకీయాల్లో ఈ రోజు మాయని మచ్చగా శాసనమండలి లో చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల విషయంలో ఈ రోజు శాసనమండలి ఛైర్మన్ వ్యవహరించిన తీరుపై బీజేపీ కూడా తప్పుపట్టింది. సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. 
తనకు ఉన్న విచక్షణాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ షరీఫ్ చెబుతుండగా... చైర్మన్ నిర్ణయాన్ని అధికార వైసీపీ సభ్యులు తప్పుపడుతూ పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. 

 

 ఈ నేపథ్యంలో మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రులు బొత్స నారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఈ రోజు బ్లాక్ డే కంటే ఘోరమైన రోజంటూ ఆవేదన వ్యక్తం చేసారు రాజేంద్ర నాథ్. చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని కౌన్సిల్‌ను ప్రభావితం చేసారంటూ మండిపడ్డారు. ఛైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఈ రోజు చట్టసభల్లో జరిగింది బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు. చంద్రబాబు స్వయంగా  కౌన్సిల్ గ్యాలరీ లోకి రావడమే కాకుండా కౌన్సిల్‌ని ప్రభావితం చేసే విధంగా వ్యవరించారని మంత్రి రాజేంద్రనాథ్ మండిపడ్డారు.

 

 రాష్ట్రం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని. BAC సమావేశం నుంచి యనమల వంటి సీనియర్ టీడీపీ నాయకులు సైతం బిల్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారని బుగ్గన మండిపడ్డారు. రూల్ నెంబర్ 71ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వ విధానాన్నే ప్రశ్నించే ప్రయత్నం చేసి బిల్లును అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మండలి ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా స్వామ్యానికి మాయని మచ్చ అని మంత్రి బొత్స మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: