జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన వికేంద్రీకరణకు సంబంధించి బిల్లు విషయంలో నిన్న శాసనమండలిలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. అధికార విపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు విమర్శలు ప్రతివిమర్శలతో  వికేంద్రీకరణ బిల్లుపై చర్చ రసాభాసగా మారి పోయింది. ఏకంగా శాసనమండలిలో తోపులాటలు కూడా జరిగినట్లు సమాచారం. వికేంద్రీకరణ బిల్లుపై రసాభాసగా సాగిన చర్చ ముగిసిన అనంతరం... వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇక వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదంటూ అధికార వైసీపీ నేతలు వాదించారు. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ నిర్ణయం కీలకం అయింది. శాసనమండలి చైర్మన్ కూడా వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించారు.

 

 

 ఇదిలా ఉంటే... నిన్న శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి అధికార విపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ సమావేశం మొత్తం హాట్ హాట్ గా సాగుతున్న వేళ లాబీ లో కూర్చొని ఉన్న బాలకృష్ణతో వైసీపీ ఎమ్మెల్యే రోజా దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై స్పందించిన బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల్లో కి అసలు సెల్ఫోను అనుమతించరని... అలాంటిది నగరి ఎమ్మెల్యే రోజా చేతిలోకి సెల్ఫోన్ ఇలా వచ్చింది అంటూ ఆయన ప్రశ్నించారు. చట్టసభలో రోజా చేతిలో ఉన్న సెల్ఫోన్ ఎవరిదో వెంటనే తేల్చాలి అంటూ డిమాండ్ చేశారు. చట్టసభలో కి నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్ తీసుకు వచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

 రాజధాని మార్పు విషయంపై స్పందించిన బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో గత టిడిపి ప్రభుత్వం ఒక రకమైన తప్పు చేస్తే... దాని ప్రస్తుత ప్రభుత్వం సరి చేయాల్సింది పోయి... జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో రకమైన తప్పు చేస్తోంది అంటూ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. మూడు రాజధాని లకు సంబంధించిన బిల్లు శాసన మండలిలో ఎలాగైతే ఆగిపోయింది... ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఇతర వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన బిల్లులు కూడా అలాగే ఆగిపోతాయి అంటూ ఆయన జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: