మూడు ప్రాంతాలలో అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం జరిగింది. అయితే ముందు నుండి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు అభివృద్ధి అమరావతిలోని జరగాలని మూడు ప్రాంతాలలో రాజధాని ఉన్న ఏ దేశం మరియు ఏ రాష్ట్రం బాగుపడదు లేదని వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో శాసనమండలిలో ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువ ఉండటంతో శాసన మండలిలో చైర్మన్ కూడా తెలుగుదేశం పార్టీ నేత కావడంతో చంద్రబాబు తన చాణిక్య రాజకీయాన్ని ప్రదర్శించి శాసనమండలిలో ఆమోదం పొందాల్సిన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి శాసనమండలి చైర్మన్ చేత బాబు తన చాణిక్య రాజకీయంతో పంపించడం జరిగింది.

 

దీంతో చంద్రబాబు శాసనమండలిలో వేసిన రాజకీయ దెబ్బకు వైసిపి పార్టీకి అబ్బ అన్నట్టు అనిపించింది. ఇదిలా ఉండగా శాసనమండలిలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలపై ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలు తీవ్రస్థాయిలో సీరియస్ అవుతున్నారు. కావాలని చంద్రబాబు వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలను మరింతగా వెనుకబాటు తనానికి కారణం అవుతున్నారు అని మూడు రాజధానులు పెడితే తప్పేంటని అభివృద్ధి అంతా జరిగితే అన్ని రాష్ట్రం బాగుంటుంది కదా అని శాసనమండలిలో చంద్రబాబు పార్టీ నాయకులు వికేంద్రీకరణ బిల్లు విషయంలో వ్యవహరించిన తీరుపై రెండు ప్రాంతలకు చెందిన ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మరోపక్క అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ప్రజలు చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలుపుతూ జై జైలు పలుకుతున్నారు.

 

అయితే ఇలా వ్యవహరించడం వల్ల చంద్రబాబే నష్టపోయారని చంద్రబాబు 29 గ్రామాలకు మాత్రమే ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యాడు భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో రాయలసీమ ప్రాంతంలో తెలుగు దేశం పార్టీ చంద్రబాబు కి కాలం చెల్లి పోయినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు కాకపోయినా మరో మూడు నెలల తర్వాత కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం బలమైన మెజార్టీ కలిగి ఉన్న నేపథ్యంలో బిల్ పాస్ అవడం లో ఎటువంటి మార్పు ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: