శాసనసభలో భారీ మెజారిటీ ఉండడంతో... అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు సహా సిఆర్డిఏ రద్దు బిల్లులకు  ఆమోద ముద్ర వేసిన జగన్ సర్కార్కు శాసనమండలిలో చుక్కెదురైంది అన్న  విషయం తెలిసిందే. వైసీపీ పార్టీకి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో... టిడిపి అధికార వైసిపి పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. మొదటిరోజు శాసన మండలిలో  వికేంద్రీకరణ బిల్లు, సి ఆర్ డి ఏ రద్దుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టకుండా అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. ఇక అనంతరం మంత్రులు నినాదాలు చేస్తూ శాసనమండలి చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఒత్తిడి  తేవడంతో ఈ రెండు బిల్లులు శాసనమండలిలో చర్చకు వచ్చాయి. బిల్లులపై  చర్చ జరుగుతున్న సమయంలో కూడా శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

 

 అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు మధ్య ఈ రెండు బిల్లులపై చర్చ జరగగా సెలెక్ట్ కమిటీకి రెండు బిల్లులను పంపించాలి అంటూ శాసనమండలిలో టిడిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.. అయితే ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదంటూ వైసీపీ మంత్రులు అందరూ భారీ ఎత్తున వాదన వినిపించగా చివరికి శాసనమండలి చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని అంటూ నిర్ణయించారు . దీంతో వైసీపీ మంత్రులు అందరూ తీవ్రస్థాయిలో శాసనమండలి చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. శాసనమండలి చైర్మన్ చుట్టుముట్టి రసాభాస సృష్టించారు. ఇకపోతే  శాసనమండలి చైర్మన్ నిర్ణయం పై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు శాసన మండలిలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడం టిడిపి విజయం గా అభివర్ణించారు. 

 

 

 తాజాగా రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న శాసనమండలి చైర్మన్ నిర్ణయంపై టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ పై ప్రశంసల వర్షం కురిపించారు ఎంపీ గల్లా జయదేవ్ . మహమ్మద్ ప్రవక్త బోధించిన నియమాలను అనుసరించి ఒత్తిళ్లను తట్టుకుని త్రికరణ శుద్ధితో షరీఫ్ శాసనమండలిలో సరైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రైతుల హృదయాల్లో అవరించిన కారు చీకట్లను శాసనమండలి చైర్మన్ షరీఫ్ తన నిర్ణయంతో తొలగించారని... అధర్మం గెలవదని మరోసారి నిరూపణ  చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అంటూ గల్లా జయదేవ్ ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: