నిన్న శాసనమండలిలో తీవ్ర రసాభాస నెలకొన్న విషయం తెలిసిందే. తీవ్ర రసాభాస మద్యే  కేంద్రీకరణ కు సంబంధించిన బిల్లుపై  చర్చ ముగిసింది. అయితే కేంద్రీకరణ సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ టిడిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో పాటు శాసనమండలి చైర్మన్ కూడా వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే శాసనమండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ట్లు వార్తలు వచ్చాయి. వైసిపి సభ్యులందరూ సభ పట్ల శాసన మండలి చైర్మన్ పట్ల దురుసుగా వ్యవహరించి .  అసభ్య పదజాలంతో దూషించారు అంటూ అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గవర్నర్ కు  ఫిర్యాదు చేస్తానని ఇప్పటికే తెలిపారు కూడా. 

 

 

 ఇకపోతే శాసనమండలిలో చైర్మన్ పై వైసీపీ నేతలు చేసిన అసభ్య పదజాలం కి గాను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏపీ మైనార్టీల ఆర్థిక సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ హిదాయత్  గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో వైసిపి మంత్రులపై ఫిర్యాదు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కోడలి నాని అనిల్ కుమార్ యాదవ్ లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆయన. శాసనమండలి చైర్మన్ గా ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి పై వైసీపీ మంత్రులు ఘాటూ  పదజాలాన్ని ఉపయోగించారంటూ  ఫిర్యాదులో పేర్కొన్నాడు. మంత్రులు వైసీపీ నేతలు మండల చైర్మన్ పై తీవ్ర పదజాలం వాడి దూషించినట్లు వచ్చిన వార్తలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ని కూడా మైనార్టీ నాయకులు  పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రలకు జత  చేశారు. 

 

 అనంతరం విలేకరులతో మాట్లాడిన వారు.. మంత్రులపై విరుచుకుపడ్డారు. మైనార్టీలకు ప్రతినిధులం అని చెప్పుకుంటున్న అధికార పార్టీకి చెందిన నాయకులు... అదే మైనార్టీ వర్గానికి చెందిన శాసనమండలి చైర్మన్ పై అనరాని మాటలు అంటు... మతం పేరుతో కూడా దూషించారు అంటూ ఆరోపించారు. మండలి చైర్మన్ గా ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తిని రాజకీయాల్లోకి లాగడం సరైనది కాదు వ్యాఖ్యానించారు . రాజకీయాలకు అతీతంగా మండలి చైర్మన్ స్థానాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కానీ.. మంత్రులు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించారు అంటూ విమర్శించారు మైనార్టీ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: