భారతదేశం కళలకు పుట్టినిల్లు... భారతదేశం వీరత్వానికి చిహ్నం... భారతదేశం ఎంతో మంది మరణం లేని అమర వీరులను  కన్నా గొప్ప భూమి... భారతదేశం మొత్తం  జనవరి 26న  గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవం అంటే ఇప్పటి తరానికి తెలిసింది.. గణతంత్ర దినోత్సవం రోజు సెలవు ఇస్తారని మాత్రమే. గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు అనేది మాత్రం ఎవరికీ తెలీదు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్ వారి  పాలనలో మగ్గిన  భారతదేశానికి ఆగస్టు 15 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడు వరకు భారతదేశం పాలనా విధానం మొత్తం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. కానీ 1947 ఆగస్టు 15 తర్వాత ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టిన తర్వాత... భారత దేశ భవిష్యత్తు కోసం సరికొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి న సమయం ఆసన్నమైంది. అలా ఎంతో మంది మేధావులు కలిసి లిఖితపూర్వకంగా తయారుచేసిన రాజ్యాంగం... 1950 జనవరి 26న నిర్మించబడింది.

 

 

ఆ తరువాత భారతదేశం పూర్తి గణతంత్ర దేశం గా మారిపోయింది. గణతంత్రం అంటే అర్థం.. ప్రజలే  ప్రభుత్వం... ప్రభుత్వమే ప్రజలు అని అర్థం వస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అన్ని రాజ్యాంగంలోని ప్రముఖ అంశాలను స్వీకరించి ఎంతోమంది మేధావులు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం గా నిర్మించారు. 11 నెలల 18 రోజుల కాలంలో ఈ రాజ్యాంగం నిర్మించబడింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగాన్ని తయారు చేసిన మేధావులతో  పాటు.. భారతమాతకు స్వేచ్ఛావాయువులు తెచ్చెదుకు ప్రాణాలర్పించిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలని  స్మరించుకుంటూ భారత దేశ ప్రజలందరూ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన పాడుతూ.. జాతీయ జెండాకు గౌరవప్రదమైన వందనం చేస్తారు. 

 

 

 ముఖ్యంగా భారతదేశంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను చూసేందుకు ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపుతూ ఉంటాయి . భారతదేశం మొట్టమొదటి పౌరుడైన రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఘనంగా  గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. కాగా  ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  త్రివిధ దళాలు అంటే ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ వారి వారి విన్యాసాలతో చూపరులను ఆకట్టుకుంటాయి. వీరంతా త్రివిధ దళాలకు  అధిపతి అయిన రాష్ట్రపతికి  గౌరవ వందనాన్ని చేస్తారు. ఇక ఈ సందర్భంగా త్రివిధ దళాలు చేసే విన్యాసాలు చూపరులను అందరికి ఒళ్ళు  గగుర్పొడిచేలా అద్భుతంగా ఉంటాయి. ఇక పల్లె పల్లెన త్రివర్ణ పతాకం రెప రెప లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి... ఆడుతున్న త్రివర్ణ పతాకానికి జనగణమన పాడుతూ గౌరవ వందనం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: