జనవరి 24వ తేదీన చరిత్రలోకి వెళితే ఎన్నో సంఘటనలు.. ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి నేడు చరిత్రలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి. 

 

 బొబ్బిలి యుద్ధం : 1757 జనవరి 24వ తేదీన బొబ్బిలి యుద్ధం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది ఒక ముఖ్య ఘట్టం. విశాఖపట్నానికి ఈశాన్యంలో 148 మైళ్ల దూరంలో బొబ్బిలి కోట ఉంది. బొబ్బిలి సంస్థ సైన్యానికి ఫ్రెంచి  విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి మధ్య జరిగిన యుద్ధమే ఈ బొబ్బిలి యుద్ధం. 

 

 జన గణ మన గీతం  ప్రారంభం : 1950 జనవరి 24 వ తేదీన భరత .. జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. ఇక  జనగణమన గీతాన్ని జాతీయ గీతం గా భారత ప్రభుత్వం స్వీకరించినప్పటి  నుంచి  భారత దేశ ప్రజలందరూ జనగణమన గీతాన్ని ఎంతో గౌరవిస్తూ ఉంటారు . 

 

 ఇందిరా గాంధీ  : 1966 జనవరి 24న భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులయ్యారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ రికార్డు సృష్టించారు. 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు ప్రధాన మంత్రిగా కొనసాగారు. 

 

 భీమవరపు నరసింహారావు జననం : 1905 జనవరి 24వ తేదీన భీమవరపు నరసింహారావు జన్మించారు. తెలుగు సినిమా సంగీత దర్శకుడైన భీమవరపు నరసింహారావు మొదటి తరం సంగీత దర్శకులలో  ఓ వెలుగు వెలిగారు. ఈయన బీఎన్నార్ గా అందరికీ సుపరిచితులు. ఎన్నో చిత్రాలకు  సంగీతాన్ని సమకూర్చి... ఎంతో పేరును గడించారు భీమవరపు నరసింహారావు.. తనదైనా సంగీతం తో ప్రేక్షకులను ఎంతగానే అలరించారు. 

 రియాసేన్ జననం : ప్రముఖ బాలీవుడ్ నటి రియా సేన్  1982 జనవరి 24వ తేదీన కోల్కతాలో జన్మించారు. 1991 సంవత్సరం నుంచి కెరీర్ ని ప్రారంభించిన రియా సేన్ ... చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా మరి ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు రియా సేన్ . మరోవైపు మోడల్ కూడా దూసుకుపోయారు . అంతే కాకుండా ఎయిడ్స్ పై అవగాహన పెంచడానికి  కీలకంగా  వ్యవహరించారు. ఇక తన హాట్ హాట్ అందాలతో కూడా బాలీవుడ్ ప్రేక్షకుల మతి పోగొట్టింది. ముఖ్యంగా హాట్ హాట్ ఫోటో షూట్లతో బాలీవుడ్ అభిమానులందరి మతి పోగొట్టింది ఈ అమ్మడు . అంతే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టింది రియా సేన్ .

 

 రియా సేన్  బాలీవుడ్తో పాటు ఎన్నో తెలుగు మలయాళం కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఇక ఎన్నో ఫ్యాషన్ షోలలో  కూడా పాల్గొంది ఈ బాలీవుడ్ నటి. ఇక తెలుగులో కూడా ఈ అమ్మడు మంచూ మనోజ్ హీరోగా నటించిన  నేను మీకు తెలుసా అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో మంచు మనోజ్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మడు నటనతో  అదరగొట్టింది.

 

 హోమీ జహంగీర్ బాబా మరణం : ప్రముఖ భారతీయ అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా. భారత అణుశక్తి కార్యక్రమం అభివృద్ధిలో అయిన ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాకుండా అణు కార్యక్రమం యొక్క పితామహుడిగా కూడా హోమి జహంగీర్ బాబా ను పిలుస్తూ ఉంటారు. ఈయన 1966 జనవరి 24వ తేదీన మరణించారు.

 

 

 పరిటాల రవి మరణం : ఆంధ్రప్రదేశ్ కు  చెందిన రాజకీయ నాయకులు  పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన మరణించారు. అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యులు పరిటాల రవి, మంత్రిగా కూడా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు వ్యవహరించిన పరిటాల రవి... 2005 జనవరి 24వ తేదీన ప్రత్యర్థుల దాడిలో మరణించారు. ఈయన భార్య పరిటాల సునీత ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: