ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని పాలన వికేంద్రీకరణ జరిగినప్పుడే రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరుగుతుంది అంటూ భావించే అభివృద్ధి వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు... అసెంబ్లీ లో అత్యధిక మెజారిటీ వైసీపీకి ఉండడంతో సులభంగా ఆమోదముద్ర వేయించింది  జగన్ సర్కారు. ఇక ఆ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టగా అక్కడ జగన్ సర్కార్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాసనమండలిలో జగన్ సర్కార్ కు తగిన మెజారిటీ లేకపోవడంతో టిడిపి ఎమ్మెల్యేలు అందరు వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంతో రసాభాస మధ్య శాసన మండలిలో బిల్లుపై చర్చ జరగగా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు చెప్పడంతో శాసనమండలి చైర్మన్ కూడా అదే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

 

 కాగా  శాసన మండలిలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఇది టిడిపి విజయం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఇకపోతే శాసన మండలి తో జగన్ సర్కార్ కి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టిడిపి ఎమ్మెల్సీ లందరూ ప్రభుత్వం తలపెట్టిన బిల్లులు అన్నింటికీ  వ్యతిరేకత తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ శాసనమండలి పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శాసనమండలిని రద్దు చేయాలనే ఆలోచన జగన్ సర్కార్ చేస్తుంది. శాసన మండలి రద్దు చేయడం ద్వారా వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీ  ఆమోదముద్ర పడితే సరిపోతుంది. 

 

 

 అయితే జగన్ సర్కార్  ఆలోచిస్తున్న శాసన మండలి రద్దు కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం... శాసనమండలిని ఏర్పాటు చేసుకోవాలా వద్దా అనే అంశం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది.  రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి నిర్వహించాలనుకుంటే  ఏర్పాటు చేసుకోవచ్చు వద్దు అనుకుంటే రద్దు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. శాసనమండలిని రద్దు చేయాలంటే అసెంబ్లీ ఆమోదించి పార్లమెంటుకు పంపాలి... లోక్సభ రాజ్యసభ శాసన మండలి రద్దు ను ఆమోదించిన తర్వాత  రాష్ట్రపతి సంతకం చేస్తే శాసన మండలి రద్దు అయిపోతుంది. ఇక  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేయగా తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: