ఏపీ రాజ‌కీయాల్లో రాష్ట్ర విభ‌జ‌న బిల్లును టీడీపీ అడ్డుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. మండ‌లిలో ఆ బిల్లును అడ్డుకోవ‌డంతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విజయం సాధించేసినట్టుగా బిల్డప్ ఇస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ వాళ్లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎక్క‌డ చూసినా విజయగర్వం ప్రదర్శిస్తోంది. రాజధాని తరలింపును సమూలంగా ఆపేసినట్లుగా వాళ్లు ఆడంబరంగా కనిపిస్తున్నారు. పచ్చ మీడియా మొత్తం.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అన్నట్లుగా.. జగన్ సర్కారు ఓడిపోయినట్లుగా తమకు ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారు. ఇక్క‌డ మండ‌లిలో బిల్లు నెగ్గ‌క‌పోయినా ప్ర‌భుత్వానికి ఏం కాదు.. కానీ టీడీపీ గెలిచిన‌ట్టు పెద్ద హైప్ వ‌చ్చింది. 

 

అయితే ఇదంతా జ‌గ‌న్ చే జేతులా కొని తెచ్చుకున్న‌ట్టే ఉంది. జ‌గ‌న్ ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ చేసేందుకు కొంత మంది నేత‌ల‌ను ఎంచు కున్నారు. వీరి చేసిన ప‌ని వ‌ల్లే ఈ రోజు జ‌గ‌న్‌కు కూడా పెద్ద మైన‌స్ అయ్యింద‌న్న చ‌ర్చ‌లే ఏపీ రాజ‌కీయ‌, మీడియా వ‌ర్గాల‌తో పాటు మేథావుల్లోనూ వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ ఈ విష‌యంలో సీనియ‌ర్ అయిన బొత్స‌తో పాటు మ‌రి కొంద‌రు మంత్రుల‌ను న‌మ్ముకోవ‌డం వాళ్ల‌కు మేనేజ్‌మెంట్ లేక‌పోవ‌డంతోనే ఇదంతా జ‌రిగింది. 

 

గ‌తంలో వైఎస్ ఏ విష‌యంలో అయినా ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను త‌న వైపున‌కు తిప్పుకునేందుకు ప‌క్కా ప్లానింగ్తో ఉండేవారు. నాడు వైఎస్ ఎవ‌రికి అయినా బాధ్య‌త‌లు ఇచ్చారంటే వారు రంగంలోకి దిగి అది స‌క్సెస్ వ‌ర‌కు నిద్ర పోయే వారు కాదు. అలాంటి వాళ్ల‌కే వైఎస్ బాధ్య‌త‌లు ఇచ్చారు. 2007 ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సైతం వైఎస్ ప్లాన్‌తోనే కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు నాడు కాంగ్రెస్‌కు ఓటేశారు. నాడు వైఎస్ ప్లాన్ వేరుగా ఉండేది. 
ఇప్పుడు జ‌గ‌న్ న‌మ్ముకున్నోళ్లు ఫెయిల్ అవ్వ‌డంతో ఇప్పుడు ఇలా టీడీపీకి చ‌నువు ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఇక‌పై అయినా జ‌గ‌న్ ఇలాంటి బాధ్య‌త‌లు కీల‌క నేత‌ల‌కు అప్ప‌గిస్తే బాగుంటుందేమో..?

మరింత సమాచారం తెలుసుకోండి: