అరణ్యంలోంచి ఊళ్లమీదికి వస్తున్న గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయ్‌. పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే పగలూ రాత్రి కంటిమీద నిద్ర లేకుండా గడుపుతున్నారు. శ్రీకాకుళం ఏజెన్సీలో పరిస్థితి దారుణంగా ఉంది.  

 

శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఏనుగుల బీభత్సమే..! ఇక్కడ ఏడాదిలో నాలుగైదు సార్లు... గజరాజుల ఘీంకారాలు, భయాందోళనలు వినిపించడం ఆనవాయితీగా మారిపోయింది. వాటిని అడవిలోకి తరిమికొడుతున్నా... తిరిగి మళ్లీ ఇదే ప్రాంతానికి వస్తున్నాయి. 

 

తాజాగా మెళియాపుట్టు ప్రాంత వాసులకు మరోసారి ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.  వారం రోజులుగా  ఇక్కడ పరిసర గ్రామాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. పగలూ తేడా లేకుండా పంటపొలాల పై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. 

 

ముఖ్యంగా చేతికి అంది వచ్చే దశలో ఉన్న మొక్కజొన్న, క్యాబేజీ పంటలు గజరాజుల తొండాల దెబ్బకు తుడిచిపెట్టుకుపోతున్నాయి.  దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పండించిన పంటను చేతికొచ్చే దశలో ఏనుగులు ఇలా నాశనం చేయడంతో ఏం చేయాలో వారికి అంతుపట్టడం లేదు. 

 

అటు ఏనుగుల్ని తరిమి కొట్టే ప్రయత్నంలో ఒక్కోసారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు గిరిజనులు. గతంలో ఇదే ప్రాంతంలో కొందరు గజరాజులకు బలైపోగా మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. అలాగే రాత్రి వేళల్లో ఎక్కడ ఊళ్ల మీదికి వచ్చి పడతాయోనని హడలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు వాటిని అడవుల్లోకి వెంటనే తరిమికొట్టే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. 

 

గజరాజుల ఘీంకారంతో శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి. భయటికి రావాలంటేనే రైతులు హఢలిపోతున్నారు. పొలాల్లో పడి చేతికొచ్చిన పంటల్ని నాశనం చేస్తుండటంతో ఏమిచేయాలో పాలుపోక కన్నీరు పెట్టుకున్నారు. గజరాజులను తరిమి తమను ఆదుకోవాలని అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఈ తంతు ఇప్పటిది కాదు.. ఎన్నో సంవత్సరాల నుంచి గజరాజులు వణికించేస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు ఏనుగులను తరిమికొట్టే ప్రయత్నం చేయగా.. అవి తిరిగి దాడి చేస్తున్నారు. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: