ప్రస్తుతం ఉన్న సమాజంలో మనుషుల మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాలు రోజు రోజుకి తరిగిపోతున్న ఘటనలు చాలానే ఉన్నాయి. కంటి ముందు మనిషి అవస్తపడుతున్న ఏ మనిషి కూడా పట్టించుకోకుండా టెక్నాలజీ మాయలో పడి ప్రస్తుతం ఎదురుగా ఉన్న వాతావరణం లో జరుగుతున్న వాస్తవాలను గ్రహించలేక టెక్నాలజీలో సోషల్ మీడియా లో వస్తున్నవి మాత్రమే పరిగణలోకి బతుకుతున్న రోజులలో కనీసం రోడ్డుపై ఉన్న కుక్కలని వాటి బాధలను కూడా గ్రహించకుండా బ్రతుకుతున్న ఈ రోజులలో ఒక కుక్క పిల్లను కాపాడటం కోసం పోలీస్ చేసిన ప్రయత్నం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

మేటర్ లోకి వెళితే ఒక పోలీస్ అధికారి అవస్తపడుతున్న కుక్కపిల్లను కాపాడటం కోసం తన ప్రాణాలు తెగించి మరీ పోరాడారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. కాల్ 112 అనే ఉత్తర ప్రదేశ్‌లోని అత్యవసర సేవలకు అంకితమైన ట్విట్టర్ పేజీ ఒకటి ఈ న్యూస్ పోస్ట్ చేసింది. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో అన్ని విషయాలను వివరించింది. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఈ సంఘటన జరిగింది. మూడు కుక్కపిల్లలు పాము ఉన్న బావిలో పడటాన్ని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు.

 

కానీ కుక్కపిల్లలు రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు దీంతో అదే సందర్భంలో ఆ దారి గుండా ఓ పోలీస్ అధికారి వెళ్తున్న ఈ నేపథ్యంలో జనాలు గుమికూడి ఉండటంతో ఏదో జరిగింది అని భావించి వచ్చిన పోలీసు అధికారి మేటర్ తెలుసుకొని తన ప్రాణాలు పణంగా పెట్టి బావిలోకి నిచ్చిన వేయించి తానే బావిలోకి దిగాడు. అంతేకాకుండా ఆ మూడు కుక్క పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పోలీసు అధికారి చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దేశంలోనే బంగారు లాంటి పోలీస్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా కొంతమంది ఇలాంటి ఆఫీసర్లకు దండేసి దండం పెట్టాలని కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: