సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎటు వెళ్తున్నారో గుర్తించలేని పరిస్థితి.. ఈ సోషల్ మీడియా కారణంగా ఎన్నో బందాలు తెగిపోతున్నాయి. అసలు ఆ సోషల్ మీడియా పచ్చని కాపురంలో నిప్పులు పోస్తుంది. సోషల్ మీడియాకు బానిస అయ్యామంటే మన చుట్టుపక్కల ఎం జరుగుతుందో కూడా గుర్తించలేము. 

 

ఆలా ఉంటుంది జీవితం. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఫేసుబుక్ ఏ చావుకు కారణం అయ్యింది. పెళ్ళైన మూడు సంవత్సరాలకే భర్త అతి దారుణంగా చంపేశాడు కారణం ఫేసుబుక్. భార్య ఎప్పుడు ఫేసుబుక్ లో బిజీ బిజీగా ఉండటంతో భార్యపై అనుమానం వచ్చింది.. అదికాస్తా పెరిగి ఆమెను చంపేసే స్థాయికి వెళ్ళింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని జైపూర్‌లో అయాజ్ అహ్మద్, రేష్మ మంగ్లానీ భార్యాభర్తలు ఉన్నారు. అయాజ్ డెలీవరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతని భార్య రేష్మ ఎప్పుడూ చూడు ఫోన్‌తో బిజీగా ఉండడం.. గంటల తరబడి ఫేస్‌బుక్‌లో ఉండటంతో భరించలేకపోయాడు... భార్య ఫోన్ లో ఎం చేస్తుందా అని అరా తీశాడు. 

 

అందులో భార్య రేష్మ ఫేస్‌బుక్‌లో అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడుతుంది. అది చూసి తట్టుకోలేక పోయాడు.. చాలా మంది అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అంతేకాదు.. ఎక్కడికి వెళ్లొచ్చినా ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేది.. అయితే ఎప్పుడు ఫేసుబుక్ లోనే ఉంటుంది అని.. 

 

భార్యకు ఎవరితోనో అక్రమసంబంధం ఉందని అనుమానం మొదలైంది. దీంతో ప్రతి రోజు భార్యతో గొడవ పడటం చేసేవాడు.. దీంతో చిరాకు వచ్చి రేష్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కొద్దీ రోజులు తర్వాత భార్య వద్దకు వచ్చి పాత విషయాలు అన్ని మర్చిపోదామని చెప్పి నమ్మించాడు. 

 

గుడ్డిగా నమ్మిన ఆమె.. ఆరోజంతా సిటీలో విచ్చలవిడిగా తిరిగారు.. పథ విషయాలను మర్చిపోదాం అని చెప్పిన భర్త ఆమెను జైపూర్ - ఢిల్లీ హైవే వద్దకు తీసుకెళ్లి ఘోరాతి ఘోరంగా గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు పెద్ద బండరాయితో ముఖాన్ని విచ్చిన్నం చేశాడు. 

 

కానీ చివరికి పోలీసులకు దొరికాడు.. రహదారి పక్కన నిర్మానుష్య ప్రాంతం పొడాళ్ళలో భార్య సేవాణ్ని పడేశాడు. అయితే ఆ సేవాణ్ని గుర్తించిన స్థానికులు భర్తను పట్టుకోగా వారి స్టైల్ లో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతనే అతని భార్యను చంపినట్టు ఒప్పుకున్నాడు. కటకటాలపాలయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: