తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈరోజు వచ్చాయి.. ఈ ఫలితాలు జాతీయ పార్టీలను సైతం వంచేశాయి. వాదించేశాయి. కారు జోరుని తెలంగాణలో ఎవరు ఆపలేరు అని నిరూపించేశాయి. అయితే జాతీయ పార్టీలు వంచలేదు కానీ.. వారి పార్టీ నేతలే వారికి షాక్ ఇచ్చారు. అంత షాక్ ఏంటి అనుకుంటున్నారా ? 

                 

అదేనండి.. టిఆర్‌ఎస్‌కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గట్టి షాకే ఇచ్చారు. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన వాళ్లకు కాకుండా వేరే వారికీ టిక్కెట్లు ఇచ్చారు అనే ఆగ్రహంతో.. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 స్థానాల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపారు. అయితే బరిలోకి దిగిన మద్దతుదారులను అందరి గెలిపించుకొని విజయం సాధించాడు. 

                        

మొత్తం 20 స్థానాల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపాగా వారిలో 16 మంది విజయం సాధించారు. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆయన మద్దతుదారుల సొంతమైంది. అంతేకాదు ఐజా మున్సిపాలిటీ పరిధిలోనూ జూపల్లి అనుచరుల హవా కొనసాగింది. అక్కడ మొత్తం 20 వార్డుల్లో తన మద్దతుదారులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపారు. అక్కడ 20మందిలో వారిలో పది మందిని గెలిపించుకోవడంతో ఇక్కడ కూడా జూపల్లినే కింగ్ మేకర్‌గా మారారు. 

                           

టీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపి గెలిపించుకొని తన సత్త చాటుకున్నాడు జూపల్లి. కేటీఆర్ మాట‌నే ప‌ట్టించుకోలేదు. కేటీఆర్‌నే ఐ డోన్ట్ కేర్ అన్నాడు... త‌డాఖా చూపించాడు జూపల్లి. దీంతో ఈ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో హైలెట్ గా నిలిచాడు జూపల్లి. 

మరింత సమాచారం తెలుసుకోండి: