తెలంగాణలో అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 22న జరగ్గా  నేడు ఎన్నికల కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు మధ్య  అధికారులు ఓట్ల లెక్కింపు చెపట్టారు . మొదటినుంచి ఎన్నికల కౌంటింగ్ లో  రాష్ట్రవ్యాప్తంగా కారు జోరు చూపించింది . ఏ పార్టీ కూడా కారు కు బ్రేకులు వేయలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ జోరు చూపించింది . ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు కు చెందిన వర్గం విజయం సాధించింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు... తాను టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను  అంటూ ప్లేట్ ఫిరాయించారు.. 

 

 జూపల్లి కృష్ణారావు తీరు తెలంగాణ రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది . టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతున్నానని ప్రకటించిన జూపల్లి కృష్ణారావు... కేసీఆర్ కేటీఆర్ తమ నాయకులు అంటూ స్పష్టం చేశారు . మిగతా విషయాలన్నీ టిఆర్ఎస్ అధిష్టానం తో మాట్లాడతాను అంటూ వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జూపల్లి కృష్ణారావు కు ఫోన్ చేయడంతో... జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ కు  వస్తున్నట్లు సమాచారం. అయితే జూపల్లి కృష్ణారావు గత కొంత కాలం నుంచి టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి  కృష్ణ రావు ఓటమి పాలవడంతో టిఆర్ఎస్ పార్టీ మధ్య దూరం పెరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. 

 

 అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు..తనకు టిఆర్ఎస్ పార్టీ కి  దూరం పెరగలేదని ఎప్పుడు తాను టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని అంటూ ప్రకటించారు. తనకు పార్టీకి మధ్య దూరం పెరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తలను అవాస్తవం అంటూ  తెలిపారు. మొన్నటి వరకు జూపల్లి కృష్ణారావు... ముఖ్యమంత్రి కేసీఆర్ రైట్ హ్యాండ్ గా ఉండేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కడతెరాస  వ్యవహారాllo కనిపించలేదు జూపల్లి కృష్ణ రావు మళ్లీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలోకి   వస్తున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: