ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నా సరే పువ్వు పార్టీకి జనాలు చెవిలో పువ్వులెట్టేస్తున్నారు.  ఆ పువ్వు పార్టీ ఆటలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు చప్పట్లు కొట్టడం లేదు సరికదా... పువ్వు అంటే మాకు లవ్వు అన్నట్టుగా ప్రవర్తిస్తూ అదును చూసి దెబ్బ కొట్టేస్తుండడంతో కమలం పువ్వు పార్టీ పెద్దల తల గిర్రా గిర్రా తిరిగిపోతోంది. ఏదో ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా బలపడిపోయి దక్షిణాది రాష్ట్రాల్లో మాకు కొండంత కండ పెరిగింది అని చూపించుకుందాము అంటే ఈ తెలుగు జనాలు పట్టించుకుంటే కదా ! పాపం ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామనే ఆలోచన కూడా ఈ తెలుగు రాష్ట్రాల జనాలకు రావడంలేదు. ఈ మధ్య తెలంగాణ లో కొన్ని యేమేపీ సీట్లు గెలుచుకుని ఆహా ... ఓహో మాకు తిరుగు లేదు అని నిరూపించుకుంది అంటే ఇపుడేమో మున్సిపాలిటీల్లో వికసించకుండా ఊడ్చేశారు. 


పైన ఉన్న కమలం పెద్దలు వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో పెద్ద జెండా ఎగరేసిద్దం అని కలలు కంటుంటే అవన్నీ పగటి కలల్లాగే మిగిలిపోతున్నాయి. ఇప్పటికి గానే వారికి అర్ధం కాలేదు ఉత్తరాదిలో ఉన్నంత ఊపు దక్షిణాదిలో లేదని. ఇక ఏపీలో ఏమైనా పరిస్థితి బాగుందా అంటే అదీ లేదు. ఇక్కడ ఆ పార్టీతోనే ఈ పార్టీతోనో పొత్తు పట్టుకుని కొన్ని సీట్లలో గెలవడం తప్ప సొంతంగా గెలిచే సత్తా ఇక్కడా లేదు. కనీసం గ్రామా స్థాయిలో కూడా ఆ పార్టీకి నిర్మాణం లేకుండా పోయింది. చెప్పుకోవడానికి జాతీయ పార్టీ అయినా ఇక్కడ మాత్రం పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటివరకు అయిందేదో అయిపొయింది వచ్చే ఎన్నికలనాటికి అయినా చక్రాలు గిర్రా గిర్రా తిప్పేద్దామా అంటే ఇక్కడ అంత సీన్ కనబడితే కదా !


 ఇక ఇలాగే ఉంటే లాభం లేదని మనకు కూడా ఓ సేన కావాలని అర్జన్టుగా గాజు గ్లాసు పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పోనీ ఆ గ్లాసు బలం ఏపీలో ఏమైనా ఉందా అంటే ఆ పార్టీ బలం కూడా దాదాపు ఇంతే. సరిపోయిందిలే మీ జోడి అని జనాలు పుసుక్కున నవ్వేసుకున్నారు. మేమిద్దరం కలిసి పోరాటాలు చేసెయ్యడమే కాదు అధికారంలోకి వచ్చేత్తామ్ అంటూ ఒకటే హడావుడి చేసేస్తున్నారు. తెలుగు జనాలేమో బీజేపీ అంటే పెద్దగా లెక్కల్లోకి తీసుకోవడంలేదు. అయినా అధికారంలోకి వచ్చేస్తామంటూ తెలుగు పెజానీకాన్ని నమ్మింసిస్తున్నారు.  సరిపోయింది లే సంబరం ! 

మరింత సమాచారం తెలుసుకోండి: