తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంప్రదాయాలలో ఎన్నో జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ యా జాతరలో తమ తమ ప్రీతికరమైన దేవుళ్లను కొలుస్తూ ప్రత్యేక పూజలు చేసి అంగరంగ వైభవంగా జాతర జరుపుకుంటూ ఉంటారు భక్తులు. ఇప్పటికే మన రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర లు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక జాతరలు జరుగుతూనే ఉన్నాయి. జాతర ఏదైనా దేవుని కృపకు పాత్రులు కావాలని భారీగా తరలి వస్తుంటారు భక్త జనాలు. ఇలా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జాతరలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కూడా ఓ ప్రతిష్టాత్మక జాతర ప్రతి ఏటా జరుగుతూ వస్తోంది. 

 

 

 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో నాగోబా జాతర పేరుతో ప్రతిష్టాత్మకంగా ఓ జాతర జరుగుతుంది. కాగా ఈ ఏడు కూడా మహా పూజతో నాగోబా జాతర మొదలైంది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే ఈ నాగోబా జాతరలో... మెస్రం  వంశస్థుల ను వివాహం చేసుకున్న 69 మంది కొత్త కోడళ్లు .. తెల్లని వస్త్రాలు ధరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాగా ఈ జాతరకు సంబంధించిన మహాపూజ నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. 69 మంది కొత్త కోడళ్లు  తెల్లని వస్త్రాలు ధరించి నిన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

 

 

 అనంతరం నాగోబా  దర్శనం చేసుకున్నారు. ఇదే సమయంలో ఆలయానికి సమీపంలో ఉన్న విశ్రాంతి గృహం బండరాళ్లపై నాగుపాము కనిపించడంతో భక్తులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం జాతర ముందు కొత్త కోడళ్లను నాగోబా ఆలయానికి తీసుకు వచ్చి బేటింగ్  అనే ప్రక్రియ నిర్వహించే.. ఆపై కొత్త కోడళ్లు  అందరికీ నాగోబా దర్శనం కల్పిస్తారు. వీరి దర్శనం తర్వాతే ప్రతి సంవత్సరం జాతర మొదలవుతుంది. ఇక అదే సమయంలో ప్రతి సంవత్సరం నాగుపాము కూడా కనిపిస్తూ ఉండటంతో దేవుడు తమను ఆశీర్వదించాడని మెస్రం  వంశస్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: