మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తిరుగు లేని విజయాన్ని సాధించుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ తన తదుపరి కార్యాచరణ పై దృష్టి సారించింది. కేసీయార్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి. తాను ఈ రాష్ట్రంలో తిరుగు లేని మెజారిటీతో గెలుపొందుతూ వస్తున్నాడు. అంతే కాకుండా అసలు ప్రజల్లో వీరు గెలవరు అని ఫిక్సయిన నాయకులు కూడా తెలంగాణ పార్టీ తీర్ధం పుచ్చుకుని తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు.

 

 

ఇక కేసీయార్ సీయం అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో నుండి, రెండోసారి సీయం పీఠాన్ని తాజాగా చేపట్టిన తర్వాత నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయాన్ని తన వెంటనే పరిగెత్తేలా చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీయం కేటీయార్ అనే పేరు చాలా ఎక్కువగా తెరపైకి వస్తుంది. ఇందుకు తగ్గట్టుగా రాజకీయాల్లో ఉన్న ఒక వర్గం వారు తమకు కాబోయే సీయం కేటీయారే అనే విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు.

 

 

ఇందుకు తగ్గట్టుగానే కేటీయార్ తో సన్నిహితంగా ఉండటానికి ప్రయాత్నాలు కూడా మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం మున్సిపల్ ఎల్లక్షన్స్ ముగిసాక కొత్త సీయం గా గులాభి బాస్ పుత్రున్ని ప్రకటిస్తాడనే వార్త గుప్పుమన్నది. ఇక ఈ విషయంలో స్వయంగా కేసీయారే స్పందిస్తూ కొత్త సీయం విషయంలో క్లారిటీ ఇచ్చాడు. అదేమంటే తన ఆరోగ్యానికేం ఢోకా లేదని, తాను ఆరోగ్యంగా ఉన్నంత కాలం వరకు తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.

 

 

దేశం కోసం వెళ్లినా..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే ఉంటానని నేనే స్వయంగా చెప్పినా..ఇంకా నమ్ముతలేరా అంటూ ప్రశ్నించారు.. సీఎంగా సీటు నుండి నన్ను పంపించే ఉపాయం ఏదైనా ఉందా.. మంచిగా కనిపించకపోతే.. ఊకో అంటే.. ఊకుంటా.. ఊకేందెందుకు పంచాయతీ... ప్రజలేమో ఉండాలని అంటున్నారు. ఏం చేయాలే చెప్పు అన్నారు సీఎం కేసీఆర్. ఇక తన ఆరోగ్యానికేం అపాయం లేదని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా తనపై అపోహలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న ఉహాగానాలకు తెరదించుతూ, మొత్తానికి సీఎం మార్పుపై కేసీఆర్ ఇలా క్లారిటీ ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: