అతను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడు.. రాజకీయ నాయకుడు.. తెలంగాణ కోసం తనవంతు కష్టపడినా నాయకుడు.. అందుకే అతనిలో నాయకుడి లక్షణాలు చూసి కేసీఆర్ సైతం అతని 2014 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి టికెట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 16వ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందాడు. 

                      

2018లోను తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడుగా అయన గెలుపొందాడు. ఈ గెలుపు అనంతరం తన లోకసభ సభ్యత్వానికి బాల్క సుమన్ రాజీనామా చేశాడు. అయితే ఇలా ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలిచే అంత శక్తి ఉన్న బాల్క సుమన్ తల్లిని కూడా భారీ మెజారిటీతో గెలిపించుకున్నాడు.. 

                   

తల్లిపై తనకున్న ప్రేమను చూపించాడు.. నిన్న తెలంగాణ రాష్ట్ర మున్సీపాల్టీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే ఈ ఫలితాలలో జాతీయ పార్టీలను సైతం ఓడించి తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీకి ఎవరు సరిలేరు అని నిరూపించుకున్నాడు సీఎం కేసీఆర్. తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని నిరూపించుకున్నాడు. 

 

ఈ నేపథ్యంలోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తల్లి కూడా మున్సిపాల్టీ ఎన్నికల్లో పోటీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మునిసిపాలిటీ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తల్లి బాల్క ముత్తమ్మ పోటీ చేశారు.. భారీ మెజారిటీతో విజయం సాధించారు. 13వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె 294 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు... తల్లిని గెలిపించుకున్న కొడుకుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: