తెలిసి తెలియని వయసులోనే పెళ్లిళ్లు... పిల్లలకు జన్మనిచ్చి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చికునే వారు  రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. బాల్య వివాహాల పై ఇప్పటికే ఎంతో మందికి అవగాహన వచ్చినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి బాల్య వివాహం జరిగింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఓ  వ్యక్తి ఆ బాలికను తీసుకొచ్చే పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ ప్రబుద్ధుడు ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా మందస మండలం లోని బుదారిసింగి  పంచాయతీ గుడికోల  గ్రామానికి చెందిన ఓ 12ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. 

 

 

 12ఏళ్ల బాలిక స్వస్థలం ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లా భత్ర  సాయి సమీపంలోని గౌడ్ గ్రామం. అయితే గుడికోల  గ్రామానికి చెందిన ఓ యువకుడు సదరు బాలికకు మేనమామ వరస అవుతాడు. అయితే ఇటీవలే ఈ 12ఏళ్ల బాలిక తల్లిదండ్రులు మరణించడంతో... మేనమామ వరుస అయ్యే  యువకుడు బాలికను ఒడిస్సా నుంచి తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆ యువకుడు ఈ 12 ఏళ్ల బాలిక శారీరకంగా కూడా కలిశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో... సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలోనే అందరు బాలికలకు పరీక్ష చేస్తుండగా ఈ 12ఏళ్ల బాలిక గర్భం దాల్చింది  అనే విషయం వెలుగులోకి వచ్చింది. 

 

 

 వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ శరత్ చంద్ర శివకుమార్... ఐటీడిఏ కు సమాచారం అందించారు. ఇక వైయస్సార్ క్రాంతి పథకం ఏపిఎం ఏ లలితను గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి పర్యవేక్షించాల్సినదిగా  ఆదేశాలు రావడంతో... ఏపీఎం తో పాటు సిసి ముఖలింగం గ్రామానికి వెళ్లి... బాలిక గర్భధారణ కు సంబంధించి పూర్తి వివరాలను సేకరించారు. కాగా సదరు బాలిక రెండు నెలల గర్భవతి గా నిర్ధారించారు వైద్యులు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకునేందుకు ఏటిడిఎ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: