తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 9 నగర పాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జ‌రిగింది.  మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 104 స్థానాల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. 8 స్థానాలను కాంగ్రెస్, 3 స్థానాలను బీజేపీ దక్కించుకున్నాయి. ఎంఐఎం 2 స్థానాల్లో విజయం సాధించింది. ఫార్వార్డ్ బ్లాక్ రెండు మున్సిపల్ పీఠాల్లో పాగా వేయడం విశేషం. అయితే నిన్న జ‌రిగిన ఓట్ల లెక్కింపులో కేవ‌లం ఒక‌టి, మూడు ఓట్ల తేడాతో గెలుపొందిన వీరులు ఉన్నారు.

 

గెలుపైనా.. ఓట‌మైనా ఒక్క పాయింట్ చాల‌న్న‌ది ఈయ‌న‌కు ఖ‌చ్చింత‌గా వ‌ర్తిస్తుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసి ప్రత్యర్థికన్నా ఒక్కటంటే ఒక్కటే ఓటు ఎక్కువ రావడంతో విజయం వరించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నారాయణపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌సలీం సమీప బీజేపీ అభ్యర్థి చలపతిపై కేవ‌లం ఒక్క ఓటుతో విజ‌య‌కెత‌నం ఎగ‌ర‌వేసి ల‌క్కీవీరుడిగా నిలిచారు. ఇక బీజేపీ అభ్యర్థికి 310 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ సలీంకు 311ఓట్లు వచ్చాయి.

 

అయితే  బీజేపీ వారు పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్‌ చేశారు. అయిన‌ప్ప‌టికీ సలీంకు ఒక్క ఓటు అధికంగా రావడంతో ధ్రువీకరించి సరి్టఫికెట్‌ను అందజేశారు. మ‌రోవైపు వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 7వ వార్డు అభ్యర్థి ఎన్‌.అజయ్‌కుమార్.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వేదవతిపై కేవ‌లం మూడు ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. . కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వేదవతికి 358 ఓట్లు రాగా.. అజయ్‌కుమార్‌కు 361ఓట్లు వచ్చాయి. అయితే ఇక్క‌డ ఈమె కూడా  రీకౌంటింగ్‌ చేయాలని అధికారులను కోరు. ఈమె అభ్య‌ర్థ‌న మేర‌కు రెండోసారి లెక్కించినప్పటికీ అవే ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఇలా మూడు ఓట్ల మెజారిటీతో ఎన్‌.అజయ్‌కుమార్ విజేతగా అధికారులు వెల్ల‌డించారు. ఇలా ఒక్క ఓటు, మూడు ఓట్లతో.. మహ్మద్‌ సలీం, ఎన్‌.అజయ్‌కుమార్ ల‌క్కీ వీరులు అనిపించుకున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: