ప్రపంచంలో దాదాపుగా ప్రతి మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఏమంటే. గ్రహాంతర వాసులు ఉన్నారా ? ఒకవేళ ఉంటే.. వారు ఎక్కడ ఉన్నారు..? ఎలా ఉన్నారు? మనుషుల రూపంలోనా.. జంతువుల రూపంలోనా...? ఇంతకు వారు ఏం చేస్తారు..? మనుషులకంటే ఏలియన్స్ తెలివైనవా...? మన భూమిపైకి ఎప్పుడైనా వచ్చాయా... లేక రాబోతున్నాయా.. . ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇక ఈ భూమి కూడా ఓ గ్రహం అన్న విషయం తెలిసిందే.

 

 

అందుకె మనలాగే ఈ విశ్వంలో ఎక్కడో చోట జీవులున్నాయన్న విషయం నమ్మక తప్పడం లేదు. అయితే ఈ గ్రహాంతరవాసుల విషయంలో మాత్రం రెండు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.. అందులో మొదటిది ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్ లైఫ్ వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందన్న వాదన. మనతో స్నేహం కోసం పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు దాటి మనకోసం వస్తున్నారని చెబుతున్నారు ఈ మొదటి కోవకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు.

 

 

ఇక మరికొందరు మాత్రం గగనతలంలో నుంచి మనల్ని నిశితంగా గమనిస్తున్న విశ్వశక్తులు... ఒక్కసారిగా విరుచుకపడవచ్చన్న భయాన్ని వెల్లబుచ్చుతున్నారు. ఇక ఈ గ్రహాంతరవాసులు మానవాళి వినాశనం కోసమే ఎదురు చూస్తున్నారన్న వాదనలూ కూడా మనకు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏ వాదన కరెక్ట్.. గ్రహాంతరవాసులు మంచివాళ్లా.. లేక మన ప్రాణాలు బలి తీసుకునే వాళ్ల అనేది ఇప్పటి వరకు కనిపెట్టలేక పోయారు. ఇకపోతే అప్పుడప్పుడు ఆకాశంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూసిన వారు అదిగో ఏలియన్స్ అంటూ నానా హడావుడి చేస్తున్నారు.

 

 

ఇలాంటి సంఘటనే పాకిస్థాన్‌లోని లాహోర్‌ గగనతలంలో జరిగింది. ఒక నల్లని వలయం ఆకాశంలో కనిపించి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఇక నల్లని ఆకారం కలిగిన ఆ వలయం ఒక రింగ్ వలే ఏర్పడి  గుండ్రగా తిరుగుతూ ఆకాశంలో తేలిపోతున్న ఆ వీడియోలను తీసిన కొందరు ట్విట్టర్‌లో పోస్టుచేయడంతో ఇప్పుడు ఈ పిక్‌లు వైరల్‌గా మారాయి. అది సాధారణ వలయం కాదని, ఎలియన్స్ ఇచ్చిన సిగ్నల్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే, అక్కడ ఏదైనా పేలుడు లేదా మంట వల్ల ఆ వలయం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కానీ దీనికి సరైన సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: