తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా సీఎం కేసీఆర్ పై ఎంపీ అరవింద్ నిప్పులు చెరిగారు. నిజామాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హిందువుగా పుట్టినందుకు, ముఖ్యమంత్రిగా ఉన్నందుకు భారతదేశం సిగ్గుపడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా కేసీఆర్ మాట్లాడటం లేదని, చీఫ్ మినిస్టర్  చీప్ గా వ్యవహరిస్తున్నారని విమ‌ర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యిందని ఆయన జోస్యం చెప్పారు. 

 

అయితే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీఆరెస్‌కు కూడా అదే గతి పడుతుందని మండిప్డారు. అలాగే  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని, త్వరలోనే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అరవింద్ మండిపడ్డారు. ఈ నేప‌థ్యంలోనే ఎంపీ అర‌వింద్.. సీఎం కేసీఆర్‌కు స‌వార్ కూడా విసిరారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే సీఏఏని అమలు కాకుండా ఆపి చూడాలి. అప్పుడు కేసీఆర్‌కు ఏ గతి పడుతుందో.. అంటూ స‌వాల్ విసిరారు. మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీకి ఓటు వేయకుంటే మహిళలకు పెన్షన్ ఆపివేస్తామని బెదిరించారు. బీజేపీ గాలికి కేసీఆర్, కేటీఆర్ కొట్టుకుపోతార‌ని అర‌వింద్ తీవ్ర స్టాయిలో ద్వ‌జ‌మెత్తారు. 

 

ఇక మ‌రోవైపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు ప్రజలు మూడో స్థానాన్ని కట్టబెట్టారని అన్నారు. ఇందూరు ప్రజలు బీజేపీకి అనుకూలంగా, ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ హవా కేవలం నిజామాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు. మేయర్ స్థానానికి కావాల్సిన బలం తమ వద్ద ఉందని చెప్పుకొచ్చారు. కానీ, ఎక్స్ అఫిషియో ఓట్లతో టీఆర్‌ఎస్  సంఖ్య పెరుగుతుందని దీంతో తమ పార్టీకి మేయర్ పీఠం దక్కే అవకాశం అనుమానమని అన్నారు. అయితే తమ సభ్యులు మాత్రం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపే అవకాశం లేదని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: