కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా తనదైన ముద్ర చూపిస్తూ అధినాయకుడు జగన్ చూపిస్తున్న బాటలో నడుస్తూ గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి. హఠంలో డాక్టర్ గా పనిచేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆమె కొత్తగా రాజ‌కీయాల్లోకి రావడంతో డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని అంద‌రూ త‌క్కువ‌గా అంచ‌నా వేసుకున్నారు. వైద్య వృత్తిలో స‌హ‌జంగానే ఉండే ఓర్పు, స‌హ‌నం వంటి వాటి కార‌ణంగా ఆమె రాజీకాయాల్లో రాణిస్తారా? అనే సందేహాలు కూడా వ‌చ్చాయి. అయితే, ఈ సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున వ్య‌క్తిగ‌త త‌న త‌ర‌ఫున, పార్టీ త‌ర‌ఫున కూడా గ‌ట్టి వాయిస్ వినిపిస్తూ విప‌క్షాల‌కు కంట్లో న‌లుసుగా మారి డైన‌మిక్ లీడ‌ర్ అనిపించుకున్నారు. 


ఆమె ఎన్నికల‌కు ముందు వ‌ర‌కు డాక్ట‌రే కానీ ఆ తరువాత అసలు సిసలైన పొలిటీషియన్ గా మారి తన మార్క్ చూపిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి రాజ‌కీయ అనుభవం లేకపోయినా శ్రీదేవి ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందే తాడికొండ ఇన్‌చార్జ్‌గా నియ‌మితులు అయిన శ్రీదేవి జ‌గ‌న్ గాలిలో సునాయాసం గా గెలిచారు. ఇక ఈమె చుట్టూ వివాదాలు కూడా అదే రేంజ్ లో అలుముకున్నాయి. శ్రీదేవి ఎస్సీ కాదని క్రిస్టియన్ అనే వివాదాలు కూడా ఆమె చుట్టూ అలుముకోవడం దీనిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవడం ఇవన్నీ చోటుచేసుకున్నాయి. 


ముఖ్యంగా అమరావతిలో రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేయడం అది తాడికొండ నియోజకవర్గంలో రాజధాని ప్రాంతం ఉండడం ఇవన్నీ ఆమెకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారినా ఆమె అన్ని ప్రతికూలతలను తట్టుకుంటూ నిలదొక్కుకోగలిగారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా పార్టీ సీనియర్ల సలహాలు, సూచనలతో ఇప్పుడు నియోజకవర్గం మీద బాగా పట్టు సాధించగలిగారు. ప్రభుత్వం చేయించిన సర్వేల్లోనూ శ్రీదేవి పనితీరుపైనే, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయంపైనా ఆమెకు సానుకూలంగా ఫలితాలు వచ్చాయట. 


పార్టీకి వీరవిధేయురాలిగా ఉండడమే కాకుండా నియోజకవర్గంలో ఎక్కడా నాయకుల మధ్య అసంతృప్తులు చెలరేగకుండా ఈమె ఎప్పటికప్పుడు నాయకులతో మాట్లాడుతూ అందరిని కలుపుకుని ముందుకు వెళ్తుండడంతో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. డాక్టర్ గా ప్రజల నాడి పట్టుకుని ఎలా అయితే వైద్యం చేశారో ఇప్పడూ అదేవిధంగా నియోజకవర్గ నాడిని కూడా తెల్సుకుని దానికి అనుగుణంగా ఆమె ముందుకు వెళ్తున్న తీరుపై ప్రశంసలు వస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: