ముంబైలో రెడ్‌లైట్ ఏరియాలో తెలుగ అమ్మాయిల బాద‌లు వ‌ర్ణ‌నాతీతం అని చెప్పాలి. ఇటీవ‌లె ముంబై రెట్‌లైట్ ఏరియాలో ఓ సెక్స్ రాకెట్ పోలీసుల‌కు చిక్కారు. కొన్ని సంద‌ర్భాల్లో అమ్మాయిలు కుటుంబ ఇబ్బందులు కానీ వారి ఆర్ధిక ఇబ్బందుల‌తో కొంద‌రు త‌ప్పుదోవ ప‌డుతుంటారు. దాన్నిపోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ‌ ఎంత క‌ట్ట‌డి చేద్దామన్నాకూడా ఎక్క‌డో ఒక‌చోట జ‌రిగేవి జ‌రుగుతూనే ఉంటాయి. మ‌రి ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ముంబై రెడ్‌లైట్ ఏరియాలో చోటు చేసుకుంది. 

 


 ఓ మల్టీప్లెక్స్ ఎదురుగా ఉన్న ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు చాక‌చ‌క్యంగా  ఓ వ్యక్తిని  అక్కడికి పంప‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అతడు సెక్స్‌ రాకెట్ నిర్వాహకుడిని సంప్రదించి అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వింటూ వుంటే అంతా సినిమాల్లో జ‌రిగిన‌ట్లు ఉంటుంది. కానీ ఇది నిజం  పోలీసుల‌కు స‌మాచారం అంద‌గానే ఎంతో తెలివిగా అక్క‌డ‌కి ఒక అబ్బాయిని పంపి విష‌యం మొత్తం కూపీ లాగ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. 

 


దీంతో పోలీసులు ఆ ఇంట్లో కి రైడ్ చేశారు.  ఇద్దరు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించారు. ఎవ‌రైతే వీటికి పాల్ప‌డుతున్నారో...  షాపరా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలం నుంచి రూ.5వేల నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సెక్స్ వర్కర్లు అహ్మదాబాద్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గ‌తంలో కూడా ఈ షాప‌రా అనే వ్య‌క్తి వ్య‌భిచారం నిర్వ‌హిస్తూ కొన్ని రోజులు జైలు ఊస‌లు లెక్క‌పెట్టాడు. తిరిగి మ‌ళ్ళీ బెయిల్ మీద వ‌చ్చి అదే ప‌ని మొద‌లు పెట్టాడు. అయితే ఇందులో సెక్స్ వ‌ర్క‌ర్లు చెప్పిన కొన్ని విష‌యాలు వింటే ఎవ్వ‌రికైనా కన్నీరు రాక మాన‌దు. షాప‌ర ఒకొక్క‌ళ్ళ‌కి రెండు వేలు వ‌సూలుచేసి వారిక మాత్రం వెయ్యి రూపాయ‌లు మాత్ర ఇస్తున్నాడ‌ని పోలీసుల‌కు ఆ అమ్మాయిలు తెలిపారు. 

 

ఆర్థిక అవసరాలు గల అమ్మాయిలను వెతికి పట్టుకుని వారిని వ్యభిచారంలోకి దించుతున్నాడని, వారి వీక్‌నెస్ మీద కొడుతున్నాడు.  వారి శరీరాలతో వ్యాపారం చేస్తూ చివ‌రికి డబ్బు విషయంలో మ‌త్రం వారిని మోసగిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇంకా ఈ దందా ఎవ‌రెవ‌రు ఉన్నారు నిందితుడు బారిన పడి వ్యభిచారంలో మగ్గుతున్న మహిళలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో మిగిలిన వారికి కూడా ఈ బారి నుంచి త‌ప్పించి ఎలాగైనా వారికి స‌హాయం చెయ్యాల‌నే నేప‌ధ్యంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: