ఈరోజు ప్రగతి భవన్ లో పలువురు ఉన్నతాధికారులు మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతి మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంద్రకరణ్రెడ్డి సత్యవతి రాథోడ్ సిఎస్ సోమేష్ కుమార్ తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి కీలక అంశాలను చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటు ... నగరాలలో కాలుష్యం పెరగకుండా ఉండేందుకు పరిరక్షణ చర్యలు తీసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగరాల లోపల బయట ఉన్న అటవీ భూముల్లో ... విరివిగా మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందని... అటవీ భూముల్లో చెట్లు నాటి  దట్టమైన అడవులు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రులకు అధికారులకు సూచించారు. 

 

 

 హైదరాబాద్ నగరం చుట్టుపక్కల విస్తరించి ఉన్న లక్షా 60 వేల అటవీ భూముల్లో  విరివిగా చెట్లను  పెంచి. హెచ్ఎండీఏ. జిహెచ్ఎంసి నిధుల నుండి 10 శాతం నిధులను పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకానికి వినియోగించుకోవాలని సూచించారు. అడవులు ద్వారా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత సహా కాలుష్యం పెరగకుండా చేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లోని  ప్రతి వార్డుకు ఒక నర్సరీ ఉండేలా చూడాలని.. అధికారులకు సూచించారు. అయితే తన ఆదేశాలను అధికారులు మంత్రులు ఏ మేరకు అమలు పరుస్తున్నారు.. పల్లె ప్రగతి   కార్యక్రమాన్ని ఎలా  నిర్వహిస్తున్నారని దానిపై తాను ఆకస్మిక తనిఖీలు చేసి సమీక్షిస్తాను అంటూ  కెసిఆర్ తెలిపారు. 

 

 

 అయితే ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టినుందని  సీఎం కేసీఆర్ ఈ సమీక్షలో వెల్లడించారు. ఇక మరోవైపు ములుగు జిల్లాలో జరుగుతున్న మేడారం జాతర పైన కూడా సమీక్షలో  చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రులు సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే మేడారం జాతరను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మేడారం జాతరకు లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: